Share News

Jagtial: ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసులు పనిచేయాలి

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:23 PM

పెగడపల్లి, జులై 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసులు పనిచేయాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు.

Jagtial:   ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసులు పనిచేయాలి

ఎస్పీ అశోక్‌ కుమార్‌

పెగడపల్లి, జులై 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసులు పనిచేయాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. గురువారం పెగడపల్లి పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన తనిఖీ చేశారు. వివిధ విభాగాలు, రికార్డులు, రిజిష్టర్లు, క్రైమ్‌ రికార్డులు, తదితరాలను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను రివ్యూ చేసి విచారణలో ఉన్న కేసుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళల భద్రత, సైబర్‌ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. పోలీస్‌స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో 5ఎస్‌ విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పోలీస్‌ శాఖ ఉపయోగిస్తున్న అధునాతన టెక్నాలజీపై ప్రతి పోలీస్‌ అవగాహన ఏర్పరుచుకోవాలన్నారు. తనిఖీ అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, మల్యాల సీఐ రాజ్‌ కుమార్‌, డీసీఆర్‌బి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, పెగడపల్లి ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్‌ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు

జగిత్యాల టౌన్‌ : సైబర్‌ నేరాల నియంత్రణకు జిల్లాలో మరింత పటిష్టమైన చర్యలు చేపట్టి బాధితులకు సాధ్యమైనంత త్వరగా డబ్బు తిరిగి అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ సీవీ ఆనంద్‌ జిల్లా ఎస్పీలను ఆదేశించారు. గురువారం పోలీస్‌ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సైబర్‌నేరాల నివారణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, బాధితులకు నగదు రిఫండ్‌ ప్రక్రియ, కేసుల దర్యాప్తు పురోగతి తదితరాలపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి ఎస్పీ అశోక్‌కుమార్‌, అదనపుఎస్పీ చేతన్‌ నితిన్‌, సైబర్‌క్రైమ్‌, ఐటీకోర్‌ ఇన్‌స్పెక్టర్‌లు కృష్ణమూర్తి, శ్రీనివాస్‌, సైబర్‌ క్రైమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 11:23 PM