Jagtial: ప్లాస్టిక్‌తో పర్యావరణానికి పెనుముప్పు
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:24 AM
ధర్మపురి, జూలై 11 (ఆంరఽధజ్యోతి): ప్లాస్టిక్‌తో పర్యావరణానికి పెను ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి, జూలై 11 (ఆంరఽధజ్యోతి): ప్లాస్టిక్‌తో పర్యావరణానికి పెను ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన న్యాయవాది ముధు సూదన్‌రెడ్డి ధర్మపురి క్షేత్రంలో వివిధ అవసరాల నిమి త్తం క్లాత్‌బ్యాగ్ అందించడానికి ముందుకు వచ్చారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్లాత్ బ్యాగులను పర్యావరణ పరిరక్షణ క్యాప్‌లను మంత్రికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతిఒక్కరూ కృషి చేయా లన్నారు. కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ ఛైర్‌ప ర్సన్ వేముల నాగలక్ష్మి, సామాజికసేవకుడు న్యాయ వాది నాగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, బుగ్గారం మాజీ జడ్పీ టీసీ బాధినేని రాజేందర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్, ఉపాధ్యక్షుడు వేముల రాజేశ్, మాజీ సర్పంచ్ ఎన్నం కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ ధర్మపురి మండలంలో మంత్రి
సుడిగాలి పర్యటన
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శనివారం ధర్మపురి మండలంలోని పెద్దనక్కలపేట, దోనూరు, తీగల ధర్మారం గ్రామాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ఆయాగ్రామాల్లో సాగునీటి పరిస్థితులను పరిశీలించా రు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు నీరు సకాలంలో అందేలా కాలువలను క్షుణ్ణంగా పరిశీలించారు. అవసరమైన మరమ్మతులు చేపట్టి నీటి సరాఫరాను మెరుగు పరచాలని అధికా రులకు ఆదేశించారు. తీగలధర్మారం గ్రామంలో లబ్ధిదారులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిగృహప్రవేశంలో పాల్గొ న్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థఛైర్మన్ సంగనభట్ల దినేష్, ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ, బుగ్గారం మాజీ జెడ్పిటీసీ బాదినేని రాజేందర్, ఏఎంసి వైస్‌ఛైర్మన్ సంగనర్సింహులు, చిలుముల లక్ష్మణ్, సర్పంచులు నల్లమల్లవ్వ, దాసరి పురుషోత్తం, పందిరి అశోక్, సుద్దాలస్వరూప, ఇరిగేషన్ ఎఈఈ మహేష్, కొండపల్లి రామ చందర్‌రావు, మొగిలిశేఖర్, జంగిలిప్రభాకర్ పాల్గొన్నారు.
ఫ రైతులకు మేలు చేయడమే లక్ష్యం..
రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో శని వారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మపురి నియోజకవర్గంలో 90,761 మంతి రైతులకు రూ.87.21 కోట్ల రైతు భరోసా నిధులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో మొత్తం 2,29,213 మంది రైతులకు గాను రూ.243.40కోట్లు రైతులఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వివరించారు. ధర్మపురికి తాగు నీటిసమస్యను తాను అధికారంలోకి వచ్చిన తరువాత పరిష్కరించి నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిపనులు జరుగుతున్నా ప్రతిపక్షనాయకులు కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లనిర్మాణం చేస్తామని తెలిపారు. సమా వేశంలో ధర్మపురి మండల కాంగ్రెస్‌అధ్యక్షుడు చిలు ముల లక్ష్మణ్, పట్టణకాంగ్రెస్ అధ్యక్షుడు చీపిరిశెట్టి రాజేష్, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు కుంటసుధాకర్, కౌన్సి లర్లు సంగి ఆనంద్, వాంకుడోతు విజయ్‌బాబు, ఒజ్జల లక్ష్మణ్, ప్రసాద్, సుముఖ్, ఆశెట్టిశ్రీనివాస్, శంకర్‌రాజు, దొనకొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.