Jagtial: భూభారతి రీసర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:28 AM
పెగడపల్లి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): భూభారతి రీసర్వేతో రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లబిస్తుందని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు.
అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత
పెగడపల్లి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): భూభారతి రీసర్వేతో రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లబిస్తుందని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు. పెగడపల్లి మండలంలోని ల్యాగలమర్రి గ్రామంలో జరుగుతున్న రీసర్వే పను లను అడిషనల్‌కలెక్టర్ బిఎస్ లత బుధవారం ఆకస్మింగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూభారతి చట్టంలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ల్యాగలమర్రి గ్రామాన్ని మొదటి విడుతలో రీసర్వేకు ఎంపిక చేసినట్లు తెలిపారు. రీసర్వేలో భాగంగా ప్రతీరైతు వారీగా భూములను ఆధునిక సాంకేతిక సాయంతో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రైతువారీగా హద్దుల గుర్తింపు , పంట కాల్వల గుర్తింపు చేపట్టనున్నట్లు తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి పట్టాదారుడికి భూవిస్తీర్ణం, సరిహద్దుల మ్యాపు, క్యూఆర్ కోడ్‌తో కూడిన భూదార్ నంబరును కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రైతులు సహకరించాలని ఆమె రైతులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నిజామొద్దీన్, గిర్దావర్ శ్రీనివాస్, సర్పంచ్ ఎలకటూరి రవి, సర్వేయర్ తనూజ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.