Jagtial: పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:46 PM
జగిత్యాల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రీపైమ్రరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ కలెక్టరేట్ ఏవో కిషన్‌కు ఏఐటీయూసీ నాయకులు వినతిపత్రం అందించారు.
- కలెక్టరేట్ ఏవో కిషన్‌కు ఏఐటీయూసీ నాయకుల వినతి
జగిత్యాల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రీపైమ్రరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ కలెక్టరేట్ ఏవో కిషన్‌కు ఏఐటీయూసీ నాయకులు వినతిపత్రం అందించారు. ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలకు రావాల్సిన సుమారు అయిదు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, ప్రతినెలా నిర్ణీత సమయంలో వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెలల తరబడి చెల్లించకపోవడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారుతోందని పేర్కొన్నారు. అలాగే గుర్తింపు కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తిచేశారు. కార్మికుల సమస్యలను అధికారులు గుర్తించి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఇన్‌చార్జి వెన్న మహేష్, నాయకులు మాడిశెట్టి కిరణ్ కుమార్, మామిడి రాజం పాల్గొన్నారు.