Jagtial: ప్రయాణికుల భద్రతే ఆర్టీసీ డ్రైవర్ల ప్రధాన లక్ష్యం
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:33 AM
జగిత్యాల టౌన్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ డ్రైవర్ల ప్రథమ కర్తవ్యమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ స్పష్టం చేశారు.
జగిత్యాల టౌన్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ డ్రైవర్ల ప్రథమ కర్తవ్యమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ డిపోలో రోడ్డుభద్రత, ట్రాఫిక్ నిబంధనలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇతర వాహనదారుల కదలికలను ముందే అంచనా వేస్తూ డిఫెన్సింగ్ విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ప్రమాదకర ఓవర్‌టేకింగ్‌లకు దూరంగా ఉండాలన్నారు. మలుపులు, పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో వేగాన్ని నియంత్రించాలని ఆదేశిం చారు. డ్రైవింగ్ సమయంలో దృష్టి మరల్చే మొబైల్ ఫోన్లను ఎట్టిపరిస్థితు ల్లోనూ ఉపయోగించవద్దని హెచ్చరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రమాదాలు జరగకుండా అప్పత్తంగా వ్యవహరించిన ముగ్గురు ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్లను ఎస్పీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, జిల్లా రవాణశాఖ అధికారి మహమ్మద్ సందాని, ఆర్టీసీ ఆర్‌ఎం రాజు, డిప్యూటీ ఆర్‌ఎం భూపతి రెడ్డి, టౌన్ ఇన్‌స్పెక్టర్ పి. కరుణాకర్, డిపో మేనేజర్లు రమేష్, మనోహర్, హరి, ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేష్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్, ఆర్టీసీ డ్రైవర్లు పాల్గొన్నారు.