Jagtial: ఘనంగా పండిట్ దీన్‌దయాళ్ జయంతి
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:01 AM
కథలాపూర్/మల్యాల/మెట్‌పల్లి టౌన్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, అంత్యోదయ సిద్ధాంతకర్త పండిత్ దీన్‌దయాళ్ 110వ జయంతిని కథలాపూర్ మండలంలోని సిరి కొండలో, మల్యాలలో, మెట్‌పల్లి బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
కథలాపూర్/మల్యాల/మెట్‌పల్లి టౌన్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, అంత్యోదయ సిద్ధాంతకర్త పండిత్ దీన్‌దయాళ్ 110వ జయంతిని కథలాపూర్ మండలంలోని సిరి కొండలో, మల్యాలలో, మెట్‌పల్లి బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సమా జంలోని చివరివ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందడానికి కృషిచేశారని అన్నారు. యువత దీన్‌దయాల్‌ను ఆదర్శంగా తీసుకుని ముం దుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో గాంధారి శ్రీనివాస్, కాశోజీ ప్రశాంత్, కాశోజీ ప్రతాప్, గొడికె లింగేశ్వర్, మారుతి, రవి, రాజు, వినోద్,నవీన్, మల్యాలలో బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు గాజులమల్లేశం, రాచర్ల రమేశ్, పొనగంటి గౌతం, గుండేటి గంగారం, నులుగొండసురేశ్,జనగాం రాము లు, బండారి రాజ్‌కుమార్, పరశురాం, ఆనందం, మెట్‌పల్లిలో బీజేపీరాష్ట్ర నాయ కుడు ఇల్లెందుల కృష్ణమాచారి, నాయకులు తోకల సత్యనారాయణ, తోపారపు రాజేందర్, అంబల్ల జగన్, అచ్చలింగం, గజ్జెలి సుధాకర్, దొంతుల చిన్నయ్య, మండలోజు మనోహర్, నాంపల్లి ప్రకాష్, ఇల్లెందుల శ్రీనివాస్, బొమ్మెన రామస్వామి, కుండ్లెపు శ్రీనివాస్ పాల్గొన్నారు.