Jagtial: ఆద్యంతం హడావిడిగా సాగిన మంత్రి పర్యటన
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:31 AM
జగిత్యాల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ప్రారంభాలు...పరిశీలనలు...లబ్ధిదారులతో ముఖాముఖి....సమావేశం..సమీక్ష... వినతి పత్రాల స్వీకరణలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
జగిత్యాల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ప్రారంభాలు...పరిశీలనలు...లబ్ధిదారులతో ముఖాముఖి....సమావేశం..సమీక్ష... వినతి పత్రాల స్వీకరణలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం జగిత్యాలలో జరిపిన పర్యటన ఆద్యంతం హడావిడిగా కొనసాగింది. జగిత్యాల జిల్లాకేంద్రంతో పాటుసమీపంలోని నూకపల్లి అర్బన్‌హౌ జింగ్ కాలనీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల, చొప్పదండి ఎమ్మె ల్యేలు, ఉన్నతాధికారబృందంతో మంత్రి పర్యటించారు.
ఫ రూ.11.80కోట్లతో
పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన..
జిల్లాలోని పలుప్రాంతాల్లో రూ.11.80కోట్లతో నిర్మిం చతలపెట్టిన పలుఅభివృద్ధిపనులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శంకుస్థాపన, శిలాఫలకాల ఆవిష్కరణ జరిపారు. జగి త్యాలలో రూ.2.25కోట్లు, మెట్‌పల్లిలో రూ.2.25కోట్లతో ఆర్డీవోకార్యాలయ భవనాలు, ఎండపల్లిలో రూ.2.25 కోట్లు, బీమారంలో రూ.2.25కోట్లతో తహసీల్ధార్ కార్యా లయ భవన నిర్మాణాలు, మల్యాలలో రూ.1.40కోట్లు, మెట్‌పల్లిలో రూ.1.40కోట్లతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణాలపనులకు శిలాఫలకాలను జగిత్యా లలో ఆవిష్కరించారు.
ఫ నూకపల్లి గృహనిర్మాణ సముదాయ పరిశీలన..
నూకపల్లి గృహసముదాయాన్ని.. సమీపంలో మిషన్‌భగీరథ ట్యాంక్ పైకి వెళ్లి అక్కడినుంచి మంత్రి పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి కాలనీలో ఎదుర వుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాల నీలో రోడ్లు, సెల్‌టవర్, తాగునీటి వసతులు, పాఠశాల, ఆసుపత్రి వంటి సౌకర్యాలు కల్పించాలని లబ్ధిదారులు కోరారు. లబ్ధిదారులు తెలిపిన సమస్యలపై మంత్రి శ్రీనివాస్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. రోడ్లు, సెల్‌టవర్, నీటివసతులు, పాఠశాల, ఆసుపత్రి వంటి అవసరమైన మౌలికసదుపాయాలను మూడు నెల ల్లోగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడ తామని హామీఇచ్చారు. ఆయాశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రంలో వసతులపై ఆరా తీశారు. కాగా సుమారు 12మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను అందించారు.
వినతి పత్రాల వెల్లువ..
జిల్లాకేంద్రానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రాలు వెల్లువలా వచ్చాయి. పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన దరఖాస్తుదారులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతి పత్రాలు ఇవ్వడానికి పోటీ పడ్డారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ అధిక సంఖ్యలో వినతి పత్రాలు వచ్చాయి. పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, కుల సంఘాల సభ్యులు పలుసమస్యలపై వినతిపత్రాలు అందించారు. జగిత్యాలలో జర్నలి స్టులకు ఇళ్లస్థలాలు కేటాయించాలని కోరుతూ జర్నలి స్టులు వినతిపత్రం అందించారు.