Share News

Jagtial: ఊరూరా సీఎం, ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకం

ABN , Publish Date - Nov 27 , 2026 | 11:17 PM

జగిత్యాల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన చేయూత పింఛ న్‌ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ జగిత్యాలలో కాంగ్రెస్‌శ్రేణులు సంబరాలు నిర్వహించాయి.

Jagtial: ఊరూరా సీఎం, ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకం
ఎమ్మెల్యే కాం్యపు కార్యాలయంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు

జగిత్యాల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన చేయూత పింఛ న్‌ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ జగిత్యాలలో కాంగ్రెస్‌శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. శుక్రవారం జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌కుమార్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో జగిత్యాల కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ గట్టు సతీష్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గిరి నాగభూషణం, సీనియర్‌ నాయకులు బండ శంకర్‌, సమిండ్ల శ్రీనివాస్‌, చాంద్‌పాషా, కూసరి అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

మల్యాల/కొడిమ్యాల/రాయికల్‌/బీర్‌పూర్‌: నూతనంగా పింఛన్లు మంజూరు చేయడంతో మండ లంలోని అన్నిగ్రామాల్లో శుక్రవారం చేయుత లబ్ధిదా రులు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న తమకు పింఛన్లు మంజూరు కావ డంపై లబ్ధిదారులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలి పారు. సింగిల్‌విండో చైర్మన్లు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. కొడిమ్యాల మండలంలోని గ్రామాల్లో సీఎం రేవంత్‌రెడ్డ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు కొడిమ్యాల గ్రామసర్పంచు గడ్డం జీవన్‌రెడ్డి, కడారిమల్లేశం, ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గుర్రంనర్సయ్యగౌడ్‌, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.రాయికల్‌ పట్టణం లో శుక్రవారం కాంగ్రెస్‌నాయకులు సీఎం రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. మండల అధ్యక్షుడు, ఏఎంసీ చైర్మన్‌ కొండపెల్లి రవీందర్‌రావు, పట్టణఅధ్యక్షుడు వాసం రాజేందర్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ గంగిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఏనుగు మల్లారెడ్డి, తంగెళ్ల రమేష్‌, మరిపెల్లి శ్రీనివాస్‌, నిమ్మల శేఖర్‌ రెడ్డి, కౌన్సిలర్‌ పల్లికొండ గంగాధర్‌, కోఆప్షన్‌ సభ్యుడు ఇర్ఫాన్‌, సుధవేణిమురళి, సర్పంచులు పాల్గొన్నారు. బీర్‌పూర్‌మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండలంలోని ఆయాగ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పెన్షన్‌దారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 11:17 PM