Jagtial: క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:16 AM
జగిత్యాల టౌన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం, స్నేహ భావం పెంపొందుతాయని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు.
ఎస్పీ అశోక్ కుమార్
అట్టహాసంగా ప్రారంభమైన 4వ వార్షిక క్రీడాపోటీలు
జగిత్యాల టౌన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం, స్నేహ భావం పెంపొందుతాయని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాకేంద్రం లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ పరేడ్ మైదా నంలో రెండురోజుల పాటు నిర్వహించే 4వ వార్షిక జిల్లా పోలీసుక్రీడలను శుక్రవారం ఎస్పీ అశోక్‌కుమార్ ప్రారంభించారు. గౌరవ వందనం స్వీకరించి అనంతరం స్పోర్స్ట్ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ క్రీడల్లో పాల్గొని మానసిక శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవా లని అన్నారు. ప్రతిరోజు విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి ఆటవిడుపుగా ఇలాంటి క్రీడాపోటీలు నిర్వహిస్తామని వాటిలో ప్రతిఒక్కరూ పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందాలని సూచించారు. అనం తరం రన్నింగ్, వాలీబాల్ క్రికెట్ క్రీడలలో ఎస్పీ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరి చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, రాములు, ఇన్‌స్పెక్టర్లు ఆరిఫ్‌అలీఖాన్, సుధాకర్, కుణా కర్, రాజు కుమార్, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, సైదులు, వేణు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.