Share News

Jagtial: డిసెంబర్‌ 15లోగా మెడికల్‌ కాలేజీ భవనాలు పూర్తిచేయాలి

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:26 AM

జగిత్యాల టౌన్‌, అక్టోబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మెడికల్‌ కాలేజీ భవనాలను డిసెంబర్‌ 15లోగా పూర్తిచేయాలని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

 Jagtial: డిసెంబర్‌ 15లోగా మెడికల్‌ కాలేజీ భవనాలు పూర్తిచేయాలి

మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీవన్‌రెడ్డి

జగిత్యాల టౌన్‌, అక్టోబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మెడికల్‌ కాలేజీ భవనాలను డిసెంబర్‌ 15లోగా పూర్తిచేయాలని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో జిల్లాఅధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంతతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెడికల్‌ కాలేజీలో కనీస వసతులు లేక విద్యార్థులు ఆందోళన చేయడం ప్రభుత్వ వైఫల్యమని జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎస్సారెస్పీ నుంచి ఆరు టీఎంసీల నీటిని విడుదల చేసి, పంటలకు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈనెల12న జగిత్యాల జిల్లా ఏర్పాటు దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించి, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జేఏసీ నాయకులు, కవులు, కళాకారులను సన్మానించనున్నట్లు విద్యాసాగర్‌రావు తెలిపారు. జిల్లా ప్రజలు, ఉద్యమకారులు పెద్దసంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని దావ వసంత కోరారు. సమావేశంలో మాజీ జడ్పీ వైస్‌చైర్మన్‌ హరిచరణ్‌ రావు, వెంకటేశ్వరరావు, దేవేందర్‌నాయక్‌, వొళ్ళెం మల్లేశం, గంగారెడ్డి, దేవేందర్‌ రెడ్డి, గాజుల రాజేందర్‌, ధర రమేష్‌ బాబు, శీలం సురేందర్‌, చంద రాధాకిషన్‌, గంగారెడ్డి, శ్రీరామ్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 12:26 AM