Share News

Jagtial: ధ్యాన శిక్షణ తరగతులను విజయవంతం చేయ్యండి

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:06 AM

కోరుట్ల, అక్టోబర్‌ 2 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో ఈనెల 4వ తేదీ నుంచి మూడురోజుల పాటు హార్ట్‌పుల్‌ నెస్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత ధ్యానశిక్షణ తరగతులను విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిరుమలవసంత గంగాధర్‌ అన్నారు.

Jagtial: ధ్యాన శిక్షణ తరగతులను విజయవంతం చేయ్యండి

- మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిరుమల వసంత గంగాధర్‌

కోరుట్ల, అక్టోబర్‌ 2 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో ఈనెల 4వ తేదీ నుంచి మూడురోజుల పాటు హార్ట్‌పుల్‌ నెస్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత ధ్యానశిక్షణ తరగతులను విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిరుమలవసంత గంగాధర్‌ అన్నారు. శుక్రవారం హార్ట్‌పుల్‌నెస్‌ సభ్యులు రూపొందించిన కరపత్రంను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వసంత ఆవిష్కరించి మాట్లాడారు. ధ్యానంలో శిక్షణ పొంది జీవితంలోని ఒత్తిడులను తొలగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వైద్యురాలు అనురాధ, హార్ట్‌పుల్‌నెస్‌ సభులు నల్ల రాజయ్య, గంగయ్య, సదాశివ, సతోష్‌, రాజేంధర్‌, కటుకం సురేంధర్‌, శ్రీనివాస్‌, జగ్గయ్య, రమేష్‌, గిరిధర్‌, పలువురు పాల్గొన్నారు.

మెట్‌పల్లి టౌన్‌ : హార్ట్‌ఫుల్‌నెస్‌ ఆధ్వర్యంలో మూడురోజుల ఉచిత ధ్యానశిక్షణ పోస్టర్‌ను మున్సిపల్‌చైర్మన్‌ మైలారపు లింబాద్రి ధాన్యకేంద్ర నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఽధ్యానం వల్ల మనిషిలో మంచి ఆలోచనలతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు రాంబాబు, న్యాయవాది పడిగెల శ్రీనివాస్‌, దొంతుల పవన్‌, అల్లకట్టు సత్యనారాయణ, మహాజన్‌ నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 12:06 AM