Share News

Jagtial: మహాత్మా గాంధీ ఆశయాలను నెరవేర్చాలి

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:10 AM

జగిత్యాల, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతీఒక్కరు నెరవేర్చాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు.

 Jagtial:   మహాత్మా గాంధీ ఆశయాలను నెరవేర్చాలి

- కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతీఒక్కరు నెరవేర్చాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్‌లో గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాపూజీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్ముని జీవితాన్ని నేటియువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిరంత రాయంగా లక్ష్యం కోసం శ్రమిస్తే ఫలితం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ కార్యాలయ ఏవో కిషన్‌, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఖైదీలు బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి

జగిత్యాల టౌన్‌ : గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల స్పెషల్‌సబ్‌జైల్‌లో వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్‌ సివిల్‌జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖైదీలు గాంధీజీ శాంతి, అహింసా సిద్ధాంతా లను ఆచరిస్తూ సత్ప్రవర్తనతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. జైలు పర్యవేక్షణాధికారి మొగిలేష్‌ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను ప్రతిఒక్కరూ ఆచరించాలని, ఖైదీల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఖైదీలకు పండ్లు, స్వీట్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ చంద్ర మోహన్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, లీగల్‌ ఎయిడ్‌ న్యాయవాదులు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో..

మహాత్మాగాంధీజీ శాంతి, అహింస, సత్యసిద్ధాంతాలు ప్రపంచానికే మార్గదర్శకమని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. గాంధీ జయంతి సందర్బంగా జిల్లా పోలీసు ప్రధానకార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ ఆరిఫ్‌ అలీఖాన్‌, ఆర్‌ఐలు వేణు, సైదులు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్‌కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

జగిత్యాలను ప్లాస్టిక్‌రహిత పట్టణంగా తీర్చిదిద్దాలి..

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి శ్రీనివాస్‌

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని పురాణి పేట, మంచనీళ్లబావి, గాంధీనగర్‌ ప్రాంతాల్లో గాంధీజీ విగ్రహాలకు మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణిశ్రీనివాస్‌, డీసీసీ అధ్యక్షుడు గజంగి నందయ్య, కమిషనర్‌ సత్యప్రణవ్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య మాట్లాడుతూ గాంధీజీ అహింసా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కోఆప్షన్‌ సభ్యుడు గట్టు సతీష్‌, కౌన్సిలర్లు అవారి పవిత్ర శివకేసరి బాబు, బడుగు పద్మరాజేందర్‌, అల్లాల సరిత రమేష్‌రావు, పంబాల సుజాతరాము, బొల్లరపు స్వప్న గిరిధర్‌, గాజుల లావణ్య మహేష్‌, దయాల చంద్రకళ శంకర్‌, దుమాల రాజ్‌కుమార్‌, అయూబ్‌ ఖాన్‌, చీటి లక్ష్మీనారాయణ, అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని 44వ వార్డులోని మహాత్మాగాంధీ విగ్రహానికి జడ్పీ మాజీచైర్‌పర్సన్‌ దావ వసంతసురేష్‌ బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆవారి పవిత్ర శివకేసరి బాబు, కోరుగంటి రాము, గాజుల లావణ్య మహేష్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు శీలం ప్రవీణ్‌, అయిల్నేని వెంకటేశ్వర్‌ రావు, ఆనంద్‌ రావు, గాజుల రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 12:10 AM