Share News

Jagtial: నకిలీ ఎరువులను, విత్తనాలను విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దుచేస్తాం

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:18 PM

గొల్లపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : నకిలీ ఎరువులు, విత్తనాలను రైతులకు విక్రయిస్తే దుకాణాల లైసెన్స్‌లు

 Jagtial:  నకిలీ ఎరువులను, విత్తనాలను విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దుచేస్తాం

-జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్‌

గొల్లపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : నకిలీ ఎరువులు, విత్తనాలను రైతులకు విక్రయిస్తే దుకాణాల లైసెన్స్‌లు రద్దుచేస్తామని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్‌ నిర్వాహకులను హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలో ఆయన ఎరువులు, విత్తనదుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాక్‌, సేల్‌ రిజిష్టర్‌లను, లైసెన్స్‌లను, తనీఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను ఖచ్చింతంగా పాటించాలని, అధిక ధరలకు విక్రయించినా, నకిలీ విత్తనాలను, ఎరువులను రైతులకు అంటగట్టిన లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు క్రిమినల్‌కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీడీఏ జాన్‌ సుధాకర్‌, ఏవో బొట్ల కరుణ ఆయన వెంట ఉన్నారు.

రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి

ధర్మపురి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని జగిత్యాల జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్‌ అన్నారు. ధర్మపురి శివారులో గల నర్సయ్యపల్లె రైతు వేదికలో డివిజన్‌ పరిధిలోని మండలాల వ్యవసాయాధికారులతో ఎల్‌నినో ప్రభావం, ఆరుతడి పంటల ప్రణాళిక గురించి గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన కంది, మొక్కజొన్న, పెసర, మినుము, తదితర పంటలను సాగు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల ఆత్మ డీపీవో జాన్‌సుధాకర్‌, ధర్మపురి ఏడీఏ రాంచందర్‌, మండల వ్యవసాయాధికారులు రాజ్‌కుమార్‌, అక్షిత, కరుణ, శ్రీకాంత్‌, మహేష్‌, సాయికిరణ్‌, ఏఈవోలు అజయ్‌, నవ్య, సమత, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 11:18 PM