Share News

Jagtial: గడువులోగా భూ రీసర్వే పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:30 AM

మెట్‌పల్లి రూరల్‌/కోరుట్ల రూరల్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): భూ రీసర్వే పనులను వేగవంతంచేసి గడువులోగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్‌ ప్రసూ నాంబ అధికారులను ఆదేశించారు.

Jagtial:  గడువులోగా భూ రీసర్వే పూర్తి చేయాలి

- అదనపు కలెక్టర్‌ ప్రసూనాంబ

మెట్‌పల్లి రూరల్‌/కోరుట్ల రూరల్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): భూ రీసర్వే పనులను వేగవంతంచేసి గడువులోగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్‌ ప్రసూ నాంబ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెట్‌పల్లి మండలంలోని మేడిపల్లి గ్రామంలో, కోరుట్ల మండలంలో జరుగుతున్న నాన్‌ కెడస్ట్రల్‌ రీసర్వే, ఎంజాయ్‌మెంట్‌ రీసర్వేపనులను ఆయామండలాల ఆర్డీవోలు నరసింహా రావు, జీవకర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. గ్రామాల్లో ఇప్పటివరకు పూర్తి చేసిన సర్వే విస్తీర్ణం, సర్వేనంబర్ల వారీగా వివరాలను పరిశీలించి, ఇంకా చేపట్టాల్సిన పనులు, పూర్తియ్యే సమయం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా గ్రామ సరిహద్దులను నిర్ధారించి, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, మండల సర్వే సిబ్బంది సమన్వయంతో రీసర్వే చేపట్టాలన్నారు. అనంతరం రైతుల భూములను సర్వే చేస్తామన్నారు. రీ సర్వేలో గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శంగా పనులు నిర్వహించి, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ యుద్ధప్రాతిపదికన సర్వే పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఆయా కార్యక్రమంలో తహసీల్దార్‌ ముక్తార్‌ఆలీ, ఆర్‌ కాంతయ్య, కోరుట్ల రూరల్‌లో తహసీల్దార్‌ కృష్ణ చైతన్య, గ్రామ సర్పంచ్‌ రంజిత్‌ రెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాస్‌, రాజేందర్‌రావుతోపాటు రెవ్వెన్యూ అధికారులు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం మార్పులు, చేర్పులు చేపట్టాలి

కోరుట్ల రూరల్‌ : ఓటర్‌ జాబితాలో మార్పులు చేర్పులు నిబంధనల ప్రకారం చేపట్టాలని అదనపుకలెక్టర్‌ ప్రసూనాంబ బీఎల్‌వోలకు సూచించారు. శుక్రవారం మండలంలోని అయిలాపూర్‌ గ్రామపరిధిలోని 103, 104, 105, 106లకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్‌ నమోదుతోపాటు సవరణపై ఆమె గ్రామ పంచాయతీలో వివరాలు పరిశీలించి బీఎల్‌వోలకు పలు సూచనలు చేశారు. ఓటర్‌ నమోదుతో పాటు సవరణ విధానంపై సమగ్ర ఆధారాలతో కూడిన దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో జీవకర్‌ రెడ్డి, తహసీల్దార్‌ కృష్ణచైతన్య, సర్పంచ్‌ రామకృష్ణ, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 12:30 AM