Jagtial: వైభవంగా కుంకుమ పూజలు
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:12 AM
పెగడపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని స్వయం భూ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాల యంలో శుక్రవారం కుంకుమపూజలు వైభవంగా నిర్వహించారు.
పెగడపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని స్వయం భూ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాల యంలో శుక్రవారం కుంకుమపూజలు వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం తొలిశుక్రవారం పురస్కరించు కుని లలితా పారాయణం గ్రూప్ సభ్యులు, మహిళాభక్తులు దాదాపు వందమంది పాల్గొనగా ఆలయ అర్చ కులు గుండివినయ్‌శర్మ వేద మంత్రా ల మధ్యన కుంకుమపూజలు అత్యం త భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఘనంగా లలితా సహస్రనామ పారాయణం
జగిత్యాల టౌన్ : పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించు కొని శుక్రవారం సాయంత్రం అమ్మవారికి శ్రీలలితా సహస్రనామ పారాయణం, ఊంజల్ సేవా నిర్వ హించారు. ఆలయంలో గణపతి, గౌరీ దేవతలకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు.