Share News

Jagtial: కేసీఆర్‌ పథకాలే అండగా నిలుస్తున్నాయి

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:28 AM

మెట్‌పల్లి రూరల్‌, జూలై 11 (ఆంధ్ర జ్యోతి) : రాష్ట్ర ఆవిర్భావం నుంచీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో అమ లుచేసిన సంక్షేమ పథకాలే బడుగు బలహీనవర్గాల ప్రజలకు నేటికీఅండగా నిలుస్తున్నాయని

Jagtial:   కేసీఆర్‌ పథకాలే అండగా నిలుస్తున్నాయి

- కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌

మెట్‌పల్లి రూరల్‌, జూలై 11 (ఆంధ్ర జ్యోతి) : రాష్ట్ర ఆవిర్భావం నుంచీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో అమ లుచేసిన సంక్షేమ పథకాలే బడుగు బలహీనవర్గాల ప్రజలకు నేటికీఅండగా నిలుస్తున్నాయని కోరుట్ల ఎమ్మె ల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. శనివారం మండలంలోని వేంపేట, వెల్లుల్ల, జగ్గసాగర్‌, రామలచ్చ క్కపేట, ఆత్మనగర్‌, ఆత్మకూర్‌ గ్రామాల్లో లబ్ధిదారుల ఇంటికి మాజీఎంపీపీ మారు సాయిరెడ్డితోకలిసి వెళ్లి సీఎంఆర్‌ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ రాష్ట్ర ప్రగతికి దోహ దపడుతున్నయన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో బాల్యవివాహాలకు అడ్డుకట్ట పడిందని, మాతాశిశు మర ణాల రేటు తగ్గిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ టీసీ పుల్ల చంద్రశేఖర్‌రెడ్డి, నల్ల తిరుపతిరెడ్డి, ముద్దాం నర్సింహులు, డాకూరి వెంకటేష్‌, లక్కం చిన్నయ్య, సర్పంచులు పాల్గొన్నారు.

చదువుతోపాటు ఆటల్లో రాణించాలి..

మెట్‌పల్లి రూరల్‌ : విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వ కుంట్ల సంజయ్‌ అన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైన మండలంలో ని వెల్లుల్ల గ్రామంలోని జిల్లాపరిషత్‌ ఉన్న త పాఠశాల విద్యార్థిని మోక్షకు ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. మోక్ష జాతీయస్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అథ్లె టిక్స్‌ అసోసియోషన్‌ ప్రధానకార్యదర్శి ముత్తయ్యరెడ్డి, ఉపాధ్యాయులు, తదిత రులు పాల్గొన్నారు.

రాష్ట్ర, జాతీయస్థాయి

క్రీడలకు ఎంపిక కావాలి..

కోరుట్ల : అథ్లెటిక్స్‌లో రాణించి రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక కావాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళశాలలో జిల్లాస్థాయి అథ్లెటిక్‌ క్రీడలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అథ్లెటిక్స్‌ పోటీలకు జిల్లా నుంచి 686మంది క్రీడకారులు పోటీలలో పాల్గొ నడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు మిడల్‌ డిస్టెన్స్‌, లాంగ్‌ డిస్టెన్స్‌, రన్నింగ్‌ పోటీలను నిర్వహిం చారు. పోటీలలో రాణించిన క్రీడకారులకు కేరళ హై స్కూల్‌ ఆధ్వర్యంలో మెరిట్‌ సర్టిఫికెట్లను అందజేశారు. ఈనెల 18న మెదక్‌ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడలో 40మంది విద్యార్థులు పాల్గొనన్నుట్లు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 12:28 AM