Share News

Jagtial: పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా కేసీఆర్‌

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:07 AM

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో పేదింటి ఆడబిడ్డల వివాహాలతో ఆర్థిక భరోసా కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని జడ్పీ మాజీచైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌ అన్నారు.

Jagtial:  పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా కేసీఆర్‌

మాజీ జడ్పీచైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో పేదింటి ఆడబిడ్డల వివాహాలతో ఆర్థిక భరోసా కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని జడ్పీ మాజీచైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌ అన్నారు. పథకాలకు 12ఏళ్లు పూర్తయిన సందర్బంగా జిల్లా కేంద్రంలోని తహసీల్‌చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ నాయకులతోకలిసి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ. 51వేలతో ప్రారంభమైన కళ్యాణలక్ష్మి సాయాన్ని రూ.1,00,116కు పెంచి పేద కుటుంబాలకు కేసీఆర్‌ అండగా నిలిచారని అన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడి,్డ కౌన్సిలర్లు కోరుకంటి రాము, అల్లాల సరిత రమేష్‌రావు, నాయకులు వెంకటేశ్వర్‌ రావు, చెట్‌పెల్లి సుధాకర్‌, గాజుల రాజేందర్‌, కళ్లెపల్లి దుర్గయ్య, గంగారెడ్డి, గుండా మధు, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

గొల్లపల్లి/వెల్గటూర్‌/రాయికల్‌ :కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అమలుచేసి 12సంవత్సరాలు పూర్తైన సందర్భం పురస్కరించుకుని గొల్లపల్లి, వెల్గటూర్‌, రాయికల్‌ మండల కేంద్రాల్లో తెలంగాణ తొలిసీఎం కేసీఆర్‌, మాజీమంత్రి కొప్పులఈశ్వర్‌ చిత్రపటానికి బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ ఎస్‌ మండలశాఖ అధ్యక్షుడు గోస్కుల జలేందర్‌, బీఆర్‌ఎస్వీ మండలశాఖ అధ్యక్షుడు ఆవారి చందు, ఏఎంసీ మాజీచైర్మన్‌ కాంపెల్లి హన్మాండ్లు, సర్పంచ్‌లు గోలి గంగా రెడ్డి, సిద్దంకి లక్ష్మీమల్లారెడ్డి, చెందోళి సింగిల్‌విండో చైర్మన్‌ గందే వెంకట మాధవ రావు పాల్గొన్నారు. వెల్గటూర్‌లో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాంచంద్రంగౌడ్‌ప్రధానకార్యదర్శి జూపాక కుమార్‌, మూగల సత్యం, పర్ష కోటయ్య, గంగయ్య, తిరుపతి, సత్యం, సుధాకర్‌రావు, మహేష్‌, నర్సయ్య, రవి, శివరాజం, అశోక్‌, మల్లేశం, లక్ష్మణ్‌, రాయికల్‌లో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బర్కం మల్లేష్‌, సర్పంచ్‌ గుమ్మడిసంతోష్‌, నాయకులు సిరిపురం గంగాధర్‌, బత్తిని నాగరాజు, కొయ్యడి మహిపాల్‌ రెడ్డి, మారంపెల్లి సాయి కుమార్‌, బత్తిని భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 12:07 AM