Share News

Jagtial: పార్టీ మారగానే కేసీఆర్‌ బెల్లం అయ్యాడు

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:27 AM

జగిత్యాల అర్బన్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): పార్టీ మారగానే జీవన్‌రెడ్డికి కేసీఆర్‌ బెల్లం అయ్యాడని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఎద్దేవా చేశారు.

Jagtial:   పార్టీ మారగానే కేసీఆర్‌ బెల్లం అయ్యాడు

జీవన్‌ రెడ్డిపై అడ్లూరి విసుర్లు

జగిత్యాల అర్బన్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): పార్టీ మారగానే జీవన్‌రెడ్డికి కేసీఆర్‌ బెల్లం అయ్యాడని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని నూకపెల్లి అర్బన్‌కాలనీలో 2.77 కోట్ల రూపాయలతో చేపట్టిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ను అసెంబ్లీ సాక్షిగా జీవన్‌ రెడ్డి తిట్టినన్ని సార్లు ఎవరూ తిట్టలేదని అన్నారు. 2014నుంచి జీవన్‌రెడ్డి కాళేశ్వరం పాజెక్ట్‌ మీద, అసెంబ్లీసాక్షిగా తిట్టిన తిట్లు ఇప్పటికి రికార్డులు ఉన్నాయన్నారు. కల్వకుంట కుటుంబం దోచుకోవడానికి వచ్చిందని మాట్లాడి.. పార్టీ మారగానే ముఖ్యమంత్రిని విమర్శించడం జీవన్‌రెడ్డికి తగదన్నారు. నూకపెల్లి డబుల్‌ బెడ్‌ రూం కాలనీ అభివృద్ధికి 32కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని ఆ నిధులతో పాఠశాలలు మందిరాలు నిర్మించడంతోపాటు అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, కలెక్టర్‌ సత్యప్రసాద్‌, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్‌చైర్మన్‌ సమిండ్ల వాణి, టీపీసీసీ కార్యదర్శి బండశంకర్‌, దూమాల రాజ్‌కుమార్‌, అరవ లక్ష్మీ, గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్‌, వీరబత్తిని శ్రీనివాస్‌, సమిండ్ల శ్రీనివాస్‌, అడువాల లక్ష్మణ్‌, చాంద్‌ పాషా పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 12:27 AM