Jagtial: అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:10 AM
వెల్గటూర్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): శాతవాహనుల తొలి రాజధానిగా ఖ్యాతికెక్కిన కోటిలింగాలలో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.
వెల్గటూర్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): శాతవాహనుల తొలి రాజధానిగా ఖ్యాతికెక్కిన కోటిలింగాలలో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007పుస్తకం, నిబంధనలు 2011, జీవో నెం.40కి సంబంధించిన పుస్తకం, ఈ చట్టానికి సంబంధించినపోలీస్‌స్టేషన్‌లో ప్రదర్శించాల్సిన బోర్డులను కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోవృద్దుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1న వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూధన్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, ఈవో కాంతారెడ్డి, మద్దుల గోపాల్‌రెడ్డి, పూదరి రమేష్, గోల్ల తిరుపతి పాల్గొన్నారు.