Share News

Jagtial: రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:47 AM

జగిత్యాల/ధర్మపురి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఇందిరమ్మ బీమా పథకాన్ని త్వరలో తీసుకువస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Jagtial:  రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం

- విద్యార్థులను భవిష్యతు మానవవనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం

- ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

- ధర్మపురిలో తెల్లవారుజామున 2.30గంటలకు ఆలయ పునఃనిర్మాణ పనులను ప్రారంభించనున్న భట్టి

జగిత్యాల/ధర్మపురి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఇందిరమ్మ బీమా పథకాన్ని త్వరలో తీసుకువస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురికి వచ్చారు. ధర్మపురిలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి హనుమంతరావు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, కలెక్టర్‌ సత్య ప్రసాద్‌, ఎస్‌పీ అశోక్‌కుమార్‌లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం, పూలమొక్కలు అందించి స్వాగతించారు. ధర్మపురిలో తెల్లవారుజామున 2.50గంటలకు శ్రీఉగ్ర నర్సింహస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ధర్మపురి, రాయపట్నం, ధర్మారంలో కాంగ్రెస్‌నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణకు భవిష్యత్తు మంచి మానవవనరులను అందించడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించడంతో పాటు వారానికి మూడు రోజులపాటు పాలు రాగి, జావా అందజేస్తున్నామని తెలిపారు. తెల్లవారితే అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అనేక ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 12:47 AM