Share News

Jagtial: పోషకాహారంతోనే రోగనిరోధక శక్తి పెరుగుదల

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:11 AM

మల్యాల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పోషకాహారంతోనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా సంక్షేమఅధికారి భాస్కర్‌ అన్నారు.

 Jagtial:   పోషకాహారంతోనే రోగనిరోధక శక్తి పెరుగుదల

- జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌

మల్యాల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పోషకాహారంతోనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా సంక్షేమఅధికారి భాస్కర్‌ అన్నారు. మండలంలోని ముత్యంపేటలో గురువారం పోషణమాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులకు పోషకాహరంపై అవగాహన కల్పించిన అనంతరం మాట్లాడుతూ చిన్నారులకు వ్యాధులు సంక్రమించకుండా సక్రమంగా టీకాలు వేయించాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పోషకాహారంపై తల్లులకు క్విజ్‌పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. చిన్నారులకు అన్నప్రాసన చేయించారు. కార్యక్రమంలో సీడీపీవో వీరలక్ష్మి, సర్పంచ్‌ దారం ఆదిరెడ్డి, ఉపసర్పంచ్‌ కందరి ముత్యంరెడ్డి, పోషన్‌అభియాన్‌ జిల్లాకోఆర్డినేటర్‌ మధు, సూపర్‌వైజర్‌ శారధ, అంగన్‌వాడీ టీచర్లు శోభరాణీ, గంగవ్వ, శారధ, మమత, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 12:11 AM