Jagtial: సైడ్‌వాల్ నిర్మిస్తే నిరాహారదీక్ష చేస్తా
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:17 AM
ఇబ్రహీంపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం మండల శివారులో గోదావరినదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజ్ దిగు వన గంగనాల ప్రాజెక్టుకు వెళ్లే కాలు వకు సైడ్‌వాల్
- కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
ఇబ్రహీంపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం మండల శివారులో గోదావరినదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజ్ దిగు వన గంగనాల ప్రాజెక్టుకు వెళ్లే కాలు వకు సైడ్‌వాల్ నిర్మిస్తే ఆయకట్టు రైతులతో కలిసి బ్యారేజ్ వద్ద నిరా హారదీక్ష చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్ర వారం ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన రైతులతోకలిసి ఆయన సదర్మాట్ బ్యారేజీని, గంగ నాల ప్రాజెక్టు మాటుకాలువను పాదయాత్రగా వెళ్లి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సదర్మాట్ బ్యారేజ్ నీటిపారుదల శాఖ అధికా రులు, జగిత్యాల జిల్లా నీటిపారుదలశాఖ అధి కారులతో రెండు మండలాల రైతుల సమక్షంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం వల్ల నిర్మల్ జిల్లా రైతులకు ఎక్కువ ఉపయోగం ఉందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వేములకుర్తి శివారులోని చెక్కల గండి వద్ద గంగనాలకు వచ్చే కాలువలో పెద్ద పెద్ద బండరాలను వేయడం వల్ల ఆయకట్టుకు నీరురాకుండా పోతోందని అన్నారు. దీంతో ఇబ్ర హీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన యమాపూర్, ఫకీర్ కొండాపూర్, నడికుడ, మొగిలిపేట, ఓబులాపూర్ తదితర గ్రామాలకు చెందిన సుమారు 5వేల ఎకరాల పంటపొలా లు బీడుగామారి, రైతులజీవితాలు ప్రశ్నా ర్థకంగా మారుతాయన్నారు. దీనికితోడు ఇప్పు డు బ్యారేజీదిగువన సైడ్‌వాల్ నిర్మిస్తే జగిత్యాల జిల్లా ఆయకట్టు ఎడారిగా మారుతుందన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డితో ఈవిషయమై చర్చించి నట్లు ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా నీటిపారుదల వాఖ అధికారులు ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సైడ్‌వాల్ నిర్మాణం చేపట్టకుండా చూస్తామని ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం రైతులతో కలిసి అక్కడే ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ సందర్భంగా వేములకుర్తి వీడీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎడపెల్లి మురళి, దేవదాస్‌ను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన రైతులు, రైతు నాయ కులు, తదితరులు పాల్గొన్నారు.