Jagtial: సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:02 AM
మెట్‌పల్లి రూరల్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు వస్తాయని వ్యవసాయాధిక ారులు పేర్కొన్నారు.
మెట్‌పల్లి రూరల్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు వస్తాయని వ్యవసాయాధిక ారులు పేర్కొన్నారు. శుక్రవారం మండలం లోని మెట్లచిట్టాపూర్ గ్రామంలో సర్పంచ్ సుంకేట అరుణ గంగాధర్ వ్యవసాయం ప్రోత్సహించడానికి అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసంద ర్భం గా వారు మాట్లాడుతూ రసాయన ఎరు వులు, పురుగుల మందల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం సాగు చేయడంతో నేల సారవంతం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణ పెరు గుతుందన్నారు. కరీంనగర్ సర్టిఫి కేషన్ అధికారి కుమార్ మాట్లా డుతూ ప్రకృతివ్యవసాయంలో పాటించాల్సిన పద్ధతులను వివ రించారు. నీమాస్త్రం, దశపర్ణి కషా యం, జీవామృతం తయారీ విధా నం, వినియోగంతో ఖర్చుతగ్గి అధిక లాభాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మి నారాయణ, ఏఈవోనరేష్, నాయ కులు, రైతులు పాల్గొన్నారు.