Jagtial: కేసీఆర్‌పై ద్వేషం.. రైతులకు శాపంగా మారింది
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:15 AM
జగిత్యాల టౌన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ పట్ల ద్వేషంతో రేవంత్ రెడ్డి కడుపునిండా విషం నింపుకున్నారని, ఆ ద్వేషం తెలం గాణ రైతాంగంపట్ల శాపంగా మారిందని
- బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీమంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ పట్ల ద్వేషంతో రేవంత్ రెడ్డి కడుపునిండా విషం నింపుకున్నారని, ఆ ద్వేషం తెలం గాణ రైతాంగంపట్ల శాపంగా మారిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కారాలయంలో జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. కన్నెపల్లి నుంచి 9టీయంసీల నీరు ఎత్తిపోయవచ్చని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి భద్రాచలానికి ప్రమాదం పొంచి ఉందని ప్రచారం చేసున్నారని అన్నారు. 30లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించినా భద్రాచలానికి ఎటువంటి సమస్య ఉత్పనం కాలేదు.. లక్ష క్యూసెక్కుల నీటితో ఏమ వుతుందని ప్రశ్నించారు. నీటిని ఎలా ఉపయోగించుకోవాలో చర్చిం చకుండా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పంటల సాగుపై సమీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వతంత్రంగా వ్యవహ రించాలని, తెలంగాణబిడ్డగా ఇంజనీర్లతో సమావేశం ఏర్పాటు చేసి వారి సలహాలు సూచనలు తీసుకొని కన్నెపల్లిని పరిశీలించి కరువును అధిగమించేందుకు కృషిచేయాలని బీఆర్‌ఎస్‌పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో మాజీమున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవెందర్‌రెడ్డి, శీలం ప్రవీన్, గాజుల రాజేందర్, కళ్లెపల్లి దుర్గయ్య, నేహాల్, రఘవీర్‌గౌడ్, గంగాధర్, కౌన్సిలర్లు ప్రదీప్, తోట హరిష్, సర్పంచులు పొట్టవత్తిని సతీష్ కుమార్, శీలం సురేందర్, మహేష్, స్వామిరెడ్డి, నాయకులు ధర రమేష్ బాబు, రూప రఘు, చెట్‌పల్లి సుధాకర్, గుండా మధు, అబ్ధుల్ బారి, అభిరామ్, హరి తదితరులు పాల్గొన్నారు.
సన్మానించిన జీవన్‌రెడ్డి..
జగిత్యాల ఆటోయూనియన్ అధ్యక్ష్యకార్యదర్శులుగా ఎన్నికైన ధ్యా వర శ్రీనివాస్, యండీ పాషాను జిల్లా కేంద్రంలోని నివాసంలో బీఆర్ ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డిని మర్యాదపూర్వ కంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా జీవన్‌రెడ్డి వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
గంగమ్మ తల్లికి మొక్కులు
జగిత్యాల పట్టణంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గంగమ్మతల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లిని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి దర్శించుకొని పూజలు నిర్వహించారు.