Jagtial: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:53 AM
పెగడపల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆల యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుం దని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్ అన్నారు.
పెగడపల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆల యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుం దని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్ అన్నారు. శుక్రవారం మండలంలోని రామ భద్రునిపల్లిలో నిర్మించనున్న శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణ పనులకు మంత్రి లక్ష్మణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై శంకు స్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ ఆలయా లు మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయా లకు ప్రతీకలని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌కుమార్, మాజీ జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌రావు, మార్కెట్‌చైర్మన్ రాములుగౌడ్, పార్టీ అధ్యక్షుడు కడారి తిరుపతి, సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్
బకాయిల విడుదల చేయించాలి
ధర్మపురి: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు డిగ్రీ, పీజీ కళా శాలల యజమానులు శుక్రవారం వినతిపత్రం సమర్పిం చారు. ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యేక్యాంపు కార్యాల యంలో ఉన్న మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ను డిగ్రీ, పీజీ కళాశాలల యజమానులు కలిసి తమ ఫీజు బకాయిల గురించి సీఎంతో మాట్లాడి తమకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి లక్ష్మణ్‌కుమార్ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకవెళుతానని తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో నవోదయ డిగ్రీకళాశాల కరస్పాండెంట్ సంగోజు అంజయ్య, శ్రీచైతన్య డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ లింగ మూర్తి, సాధన డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.