Jagtial: తరచూ విద్యుత్ అంతరాయం
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:40 AM
మెట్‌పల్లి రూరల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్ సరఫరాలో తరచూ ఏర్పడుతున్న అంతరాయం,
సరఫరా లోపాలు..కాలిపోతున్న మోటార్లు
- పట్టించుకోని అధికారులు..నష్టపోతున్న రైతులు
మెట్‌పల్లి రూరల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్ సరఫరాలో తరచూ ఏర్పడుతున్న అంతరాయం, వోల్టేజీ హెచ్చుతగ్గులతో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం మండలంలోని చౌలమద్ది గ్రామంలో విద్యుత్ సరఫరా లోపాలతో 12 మంది రైతులకు చెందిన వ్యవసాయ మోటార్లు కాలిపోయాయి. గ్రామశివారులోని పంట పొలాల వద్ద 33కేవీ, 100కేవీ విద్యుత్ లైన్లతో సరఫరాల జరుగుతుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కరెంట్ సమస్యలు ఎక్కువయైు సరఫరాలో తరచూ అంతరాయం, ఓల్టేజీ హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. వైర్లు లూజుగా ఉండడంతో గాలి, వర్షాలకు ఒకదానికి ఒకటి తాకడంతో షార్ట్ సర్క్యూట్‌తో మోటార్లు, ఫీజులు, స్టార్లర్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, అల్లూరి రాములు, లింగపూరం రాజశేఖర్, పడిగేల రాజశేఖర్, ఏలేటి నవీన్, కుమ్మం పెద్దగంగారం, వెల్మ అశోక్, ఏలేటి సత్యనారాయణ, తీగల రవి, వెల్మ రాజేంధర్‌ల సంబందించిన రైతుల మోటార్లు, ఫీజులు, స్టార్టర్లు కాలిపోయాయి. కాలిపోయిన వాటి మరమ్మతులకు రూ.10వేల నుంచి 20 వేల వరకు, కొత్త మోటార్ల కొనుగోలుకు అదనపుఖర్చులు భరించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు విద్యుత్ సరఫరాలో లోపాలను వెంటనే సరిచేసి, వోల్టేజీ హెచ్చుతగ్గులు లేకుండా నాణ్యమైనవిద్యుత్ అందించాలని రైతులు కోరుతున్నారు.
అధికారులు తప్పిదంతో నష్టాలు...
- అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, రైతు, చౌలమద్ది
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోతున్నాం. కరెంట్‌సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కాలిపోయిన మోటార్లకు రూ.10వేలకు పైగా ఖర్చు అవుతోంది. నష్టపరిహారం అందించి, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి.