Share News

Jagtial: కేసుల దర్యాప్తు, తీర్పుల్లో ఫోరెన్సిక్‌ ఆధారాలు కీలకం

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:23 AM

జగిత్యాల టౌన్‌, అక్టోబర్‌ 31 (ఆంధ్రజ్యోతి): నేర దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఆధారాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని జిల్లా ప్రధానన్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు.

Jagtial:   కేసుల దర్యాప్తు, తీర్పుల్లో ఫోరెన్సిక్‌ ఆధారాలు కీలకం
సదస్సులో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

జగిత్యాల టౌన్‌, అక్టోబర్‌ 31 (ఆంధ్రజ్యోతి): నేర దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఆధారాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని జిల్లా ప్రధానన్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. శనివారం జగిత్యాల బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదులకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రాముఖ్యత, అనువర్తనాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేరస్థల పరిశీలన, భౌతిక సాక్ష్యాల గుర్తింపు, పరిరక్షణ, చేతిరాత, సంతకాల పరిశీలన, ఫోర్జరీ, పత్రాల ప్రామాణికత, వేలి ముద్రలు, డీఎన్‌ఏ పరీక్షలు, సైబర్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ వంటి అంశాలపై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. హైదరబాద్‌కు చెందిన ప్రోబ్‌ ల్యాబ్‌ ఫోరెన్సిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ మోహన్‌ ఎర్రగొల్ల ప్రధాన వక్తగా పాల్గొని ఫోరెన్సిక్‌ సైన్స్‌లోని వివిధ విభాగాలు, వాటి ప్రాధాన్యత, కేసుల దర్యాప్తులో శాస్ర్తీయ ఆధారాల వినియోగంపై వివరించారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌జడ్జి కమ్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి డి నాగేశ్వర్‌రావు, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి సరిత మట్టా, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ఉపాధ్యక్షుడు మర్రిపెల్లి సత్యప్రకాశ్‌, సీనియర్‌ న్యాయవాదులు రాచకొండ శ్రీరాములు, బండ భాస్కర్‌రెడ్డి, మెట్ట మహేం దర్‌, చెందొలి లక్ష్మణ్‌, ఎనగంటి రామచంద్రం, కరవత్తుల భూమయ్య తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 12:23 AM