Jagtial: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:31 AM
కోరుట్ల రూరల్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు రోడ్డెకి నిరసన తెలిపారు. రహదారిపై బైళాయించి ఆందోళన చెపట్టారు.
కోరుట్ల రూరల్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు రోడ్డెకి నిరసన తెలిపారు. రహదారిపై బైళాయించి ఆందోళన చెపట్టారు. కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఎకీన్‌పూర్ సబ్‌స్టేషన్ పరిధిలో నిరంతరం విద్యుత్‌కోతల ఉన్నాయని ఆరోపిస్తూ బుధవారం కోరుట్ల వేములవాడ రోడ్డుపై రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడారు. నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం కనీసం 10 గటల సరఫరా కూడ ఇవ్వడంలేదని ఆరోపించారు. త్రీఫేస్ సరఫరా 12 గంటలకు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీస్‌లు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేయగా రైతులు ట్రాన్స్‌కో అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించమని తెలిపారు. విద్యుత్‌శాఖ రూరల్ ఇన్‌చార్జు ఏఈ వరప్రసాద్ అక్కడి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. మెట్‌పల్లి డీఈ మదుసుదన్‌కు విషయం ఫోన్ ద్వార వివరించారు. స్పందించిన డీఈ మదుసూదన్ రైతులతో ఫోన్ ద్వారా మాట్లాడి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎఖీన్‌పూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.
సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు..
కథలాపూర్ : వ్యవసాయ రంగానికి అప్రకటితంగా విద్యుత్‌కోతలు విధించడాన్ని నిరసిస్తూ బుధవారం మండలంలోని భూషణరావుపేట 33/11 కేవీవిద్యుత్ సబ్‌స్షేషన్‌ను రైతులు ముట్టడించారు. మొదట సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏ క్షణాన కరెంట్ కోత విధిస్తున్నారో తెలియడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఉదయం 5 గంటల నుంచి సరఫరా ఇస్తున్నామని చెబుతున్నా ఏడు, ఎనిమిది గంటల దాకా కూడా త్రీఫేజ్ సరఫరా చేయడం లేదని ఏఈతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఇక మీదట సక్రమంగా సరఫరా జరిగేలా చూస్తామని ఏఈ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బద్దం మహేంధర్‌రెడ్డి, పురుకుటపు సంతోష్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొండ ఆంజనేయులు, శేఖర్‌రెడ్డి, పురకుటపు పుల్లారెడ్డి తదితరులు ఉన్నారు.
ఇబ్రహీంపట్నం : మండలంలోని కోజన్ కొత్తూరు, కేశపూర్ గ్రామాల రైతులు బుధవారం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్‌ను ముట్టడించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వేలాపాల లేకుండా కరెంటు కోతలు విధిస్తున్నారని, పొలాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ నవీన్‌కుమార్ వచ్చి సర్ది చెప్పినా, రైతులు వినకపోవడంతో విద్యుత్ శాఖ ఎఈ సతీష్ వచ్చి రైతులతో మాట్లాడారు. త్రీఫేస్ కరెంట్‌లో సమస్యలు తలెత్తకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.