Jagtial: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:46 PM
బీర్‌పూర్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి తిరుపతి అన్నారు.
బీర్‌పూర్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి తిరుపతి అన్నారు. శుక్రవారం బీర్‌పూర్, మండలకేంద్రంల్లో ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘంలో బీర్‌పూర్, కొల్వాయి సహకార సంఘాల పరిదిలోని రైతులతో చైర్మన్ ముప్పాల రాంచంధర్‌రావ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌పీవో, రూట్యాగ్ స్మార్ట్ విలేజి సెంటర్, రైతులకు చేపల పెంపకం లాంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాబార్డు డీడీ ఎం దిలీప్, డీహెచ్‌ఎస్‌వో లత, చేపల పెంపకం సలహాదారు సాయికృష్ణ, కేడీసీసీ తుంగూర్ బ్రాంచ్ మేనేజర్ లక్ష్మీ, కేడిసీసీ కరీంనగర్ బ్రాంచ్‌మేనేజర్ హన్మంతరావ్, కొల్వాయి సింగిలివిండో చైర్మన్ నవీన్‌రావ్, ఆయా గ్రామల రైతులు పాల్గొన్నారు.
రాయికల్ : రైతులు ప్రత్యామ్నయ పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు అన్నారు. మండలంలోని అలియానాయక్ తండా గ్రామం లో శుక్రవారం రైతులకు నేలఆరోగ్యం, సేంద్రి య కర్బనం ప్రాముఖ్యత, పంటల మార్పిడి, ప్రత్యామ్నయ పంటలసాగు గురించి అవ గాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈవో నరేష్, రైతులు పాల్గొన్నారు.
సారంగాపూర్ : తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని తహసీల్దార్ ఎండీ వహిదో ద్దిన్ అన్నారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాల యంలో ఎల్‌నినో నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలైన పెసర,జొన్న, నూనెగింజలు వంటి పంటలు సాగుకు అనుకూలమని అధికారులు ప్రణా ళిక తయారుచేశారు. కార్యక్రమంలో ఏవో ప్రధీప్‌రెడ్డి, విద్యుత్‌శాఖ సబ్‌ఇంజనీర్ వేణుగోపాల్, ఇరిగేషన్ ఏఈ ప్రణయ్, అర్టికల్చర్ హెచ్‌ఈవో వంశీ, ఏఈవో వెంకటేష్ పాల్గొన్నారు.
కథలాపూర్: రసాయనికఎరువులు వినియోగించ డం వల్ల నేలకు హాని జరుగుతుందని వ్యవసాయాధి కారి యోగిత పేర్కొన్నారు. మండలంలోని దూలూ రులో ఖేత్‌బచావో అభియాన్‌లో భాగంగా రైతులకు పంటల సాగువిధానాలపై అవగాహన కల్పించారు. వరి కొయ్యకాలను కాల్చకుండా నేలలో కలియ దున్నితే నేలలోని సూక్ష్మజీవులు వృద్ధిచెంది నేల ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎండీ రజియాబేగంఅజీం, ఏఈఓ మౌనిక, పంచాయతీ కార్యదర్శి నిజామోద్దీన్, విండో డైరెక్టర్ అంజయ్య తదితరులు ఉన్నారు.