Jagtial: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలి
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:36 AM
జగిత్యాల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకు నూరి సంజయ్‌కుమార్ అన్నారు.
- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్
జగిత్యాల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకు నూరి సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఇస్కా ఫౌండేషన్, రోటరీక్లబ్, రెడ్ క్రాస్, ఆపీ ఆధ్వర్యంలో ప్రభుత్వబాలికల జూని యర్‌కళాశాలలో వనమ హోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధరకాల పండ్ల మొక్కలు నాటారు. జల్‌ప్రతిజ్ఞ, హార్టు ఫుల్‌నెస్ అంశాలపై వ్యాసరచన పోటీలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, రోటరీక్లబ్ సభ్యులు మంచాలకృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టీవీసూర్యం పాల్గొన్నారు.