Share News

Jagtial: సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:05 AM

పెగడపల్లి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీటి సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తున్నట్లు సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు.

Jagtial:  సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

పెగడపల్లి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీటి సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తున్నట్లు సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం లింక్‌2 కాలువ ద్వారా దీకొండ చెరువులోకి అక్కడి నుంచి పెగడపల్లి చెరువులోకి నీటిని ఎత్తిపోసి పెగడపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 39మందికి రూ.39లక్షల4వేల 524విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులు, ముఖ్యమంత్రి సహాయనిఽధి ద్వారా 115మందికి మంజూరైన 35లక్షల 39వేల 500విలువైన చెక్కులను అందజేశారు. వచ్చేదసరాకి సోదరీమణులకు ఇందిరమ్మ చీరలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ బుర్ర రాములుగౌడ్‌, కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు కడారితిరుపతి, తహసీల్దార్‌ నిజామొద్దీన్‌, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్‌ రావు, ఎంపీవో శశికుమార్‌ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఐదు మండలాలకు

అనువుగా పార్టీ కార్యాలయం..

ఎండపల్లి : మండలంలోని రాజారాంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్టీ కార్యాలయ పనులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పరిశీలించారు. రాజారాంపల్లిలో నిర్మి స్తున్న పార్టీ కార్యాలయం ఐదుమండలాల ప్రజలకు అనువుగా ఉంటుందని అన్నారు. దసరా లోపు పనులను పూర్తిచేసి అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తామని అన్నారు. మంత్రివెంట సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ మద్దుల గోపాల్‌ రెడ్డి, సంగ రమేష్‌ యాదవ్‌, తాటిపర్తి శైలెందర్‌ రెడ్డి, గూఢ రాంరెడ్డి. జీ రెడ్డి మహెందర్‌ రెడ్డి, కందికట్ల రాజేశం పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 12:05 AM