Jagtial:శిశువుల ఆరోగ్య సూచీ మెరుగు పరిచేందుకు కృషి చేయాలి
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:54 PM
జగిత్యాల అర్బన్, జూలై 3 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో మాతా-శిశు ఆరోగ్య సూచీలను మెరుగు పరిచేందుకు అన్ని ఆరోగ్యసంస్థలు సమ న్వయంతో పని చేయాలని జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత పిలు పునిచ్చారు.
- జిల్లా వైద్యాధికారి సుజాత
జగిత్యాల అర్బన్, జూలై 3 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో మాతా-శిశు ఆరోగ్య సూచీలను మెరుగు పరిచేందుకు అన్ని ఆరోగ్యసంస్థలు సమ న్వయంతో పని చేయాలని జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత పిలు పునిచ్చారు. నవజాత శిశువుమరణాల రేటు తగ్గించడం లక్ష్యంగా ఏర్పాటుచేసిన సంకల్పం కార్యక్రమంపై శుక్రవారంజిల్లాస్థాయి సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ జిల్లాలో మాతా,శిశు మరణాలు తగ్గించేం దుకు గర్భిణులకు నాణ్యమైన గర్భధారణ, ప్రసూతి, ప్రసవానంతర సేవలు అందించడం, హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి సకాలంలో రిఫర్ చేయడం, ప్రసవ సమయంలో ఫీటల్ హార్ట్‌రేట్ పర్యవేక్షణ, అవసరమైన సంద ర్భాలలో సకాలంలో సిజేరియన్ చేయడం చేయాలని అన్నారు. తల్లి, శిశువులను ప్రసవానంతరం తప్పనిసరివారి ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవడం, ప్రమాద సంకేతాలను త్వరగా గుర్తించి నిపుణుల వద్దకు రిఫర్ చేయడం ద్వారా మాతా, శిశు మరణాలను తగ్గించవచ్చని సూచించారు. జిల్లాలోని అన్ని ఆరోగ్యసంస్థల వైద్యులు, గైనకాలజిస్ట్‌లు, పీడియాట్రిషన్‌లు, వైద్యులు, ఆరోగ్యసిబ్బంది సమన్వ యంతో పనిచేసి సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్య క్రమంలో జిల్లాఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవీ కృష్ణమూర్తి, వైద్యవిధాన పరిషత్ సూపరింటెండెంట్ డాక్టర్‌రామకృష్ణ, ఉపవైద్యాధికారి ముస్కు జైపాల్‌రెడ్డి, డాక్టర్ నరేందర్, తదితరులు పాల్గొన్నారు.