Jagtial: దుర్గా నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:21 AM
పెగడపల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): దుర్గానవరాత్రి, దసరా ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు.
ఎస్పీ అశోక్ కుమార్
పెగడపల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): దుర్గానవరాత్రి, దసరా ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. పెగడపల్లి పోలీస్‌స్టేష న్ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌పరిధిలో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు, స్టేషన్రికార్డుల నిర్వహణ,బీట్వ్యవస్థ అమలు తది తర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దుర్గానవరాత్రి ఉత్స వాలసందర్భంగా పోలీస్అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తం గా ఉండి విధులు నిర్వహించాలని అన్నారు. విజిబుల్పోలీసింగ్కు ప్రత్యేకప్రాధాన్యత ఇవ్వా లని, అనుమానాస్పద వ్యక్తులు, వాహ నాల కదలికలపై నిఘాఉంచాలన్నారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరంచేసి చోరీలు, గంజాయి అక్రమరవాణా, అసాంఘిక కార్యక లాపాలపై కఠిననిఘా కొనసాగించాలన్నారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల బారినపడకుండా అవగాహనకార్యక్రమాలు నిర్వహిం చాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐకుమారస్వామి ఉన్నారు.