Share News

Jagtial: అధికారులకు రైతులంటే అంత చులకనా?

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:34 AM

బీర్‌పూర్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): అధికారుల కు రైతులంటే అంత చుల కనగా ఉందా?. నెల రోజు లు గడుస్తున్నా లిఫ్ట్‌ ఇరి గేషన్‌లలో

Jagtial: అధికారులకు రైతులంటే అంత చులకనా?

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి

బీర్‌పూర్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): అధికారుల కు రైతులంటే అంత చుల కనగా ఉందా?. నెల రోజు లు గడుస్తున్నా లిఫ్ట్‌ ఇరి గేషన్‌లలో ట్రాన్స్‌ఫార్మర్లు ఎందుకు ఏర్పాటు చేయ లేదని మాజీమంత్రి, బీఆర్‌ ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం మండలం లో పర్యటించిన ఆయన మం గేళ, కమ్మునూర్‌ గ్రామాల్లోని లిఫ్ట్‌ ఇరిగేషన్‌లను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి గతనెల 27న ట్రాన్స్‌ఫార్మార్లు ఏర్పాటు చేయాలని కొరిన ప్పుడు వారం రోజుల గడువు అడిగిన మీరు నెల రోజులైనా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కాలువ నీరు వచ్చే అవకాశం లేనప్పుడు రైతులకు ఉన్న ఏకైక మార్గం కరెంటు మోటార్లు అని అన్నారు. అవి నడవాలంటే ట్రాన్స్‌ ఫార్మర్లను ఏర్పాటు చేయడం ఓకే మార్గమని అన్నారు. ఆరెపల్లి, ధర్మపురి నియోజకవర్గం వారుకూడా తనవద్దకు వస్తున్నారని వివరించారు. సోమవారం వరకు రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేసి సాగు నీరు అందించాలని సూచించారు. ఆయన వెంట మాజీఎంపీపీ మసర్తి రమేష్‌, మాజీ జడ్పీటీసీ ముక్క శంకర్‌, నాయకులు జితేంధర్‌ యాదవ్‌, లక్ష్మన్‌ రావ్‌, సుభాష్‌ యాదవ్‌, జోగిరెడ్డి, మల్లా రెడ్డి, లక్ష్మినారాయణ, ఉప సర్పంచ్‌ వీరేష్‌ ఉన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 12:34 AM