Share News

Jagtial: కరువు పరిస్థితుల్లో సమ్మిట్‌ పేరుతో కోట్ల ధనం వృథా

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:21 AM

జగిత్యా అగ్రికల్చర్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరువు విలయ తాండవం చేస్తున్న వేళ దేశవ్యతిరేకులతో పెట్టుబడుల ఆర్జనకు భారత్‌ సమ్మిట్‌ పేరుతో కోట్లరూపాయాలు వృథా చేయడం సరికాదని, ఈ సమ్మిట్‌ను బీజేపీ పక్షాన వ్యతిరేకిస్తున్నామని బీజేపీ జిల్లాఅధ్యక్షుడు యాదగిరిబాబు అన్నారు.

 Jagtial:  కరువు పరిస్థితుల్లో సమ్మిట్‌ పేరుతో కోట్ల ధనం వృథా
రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు

బీజేపీ పక్షాన భారత్‌ సమ్మిట్‌ నిర్వహణను వ్యతిరేకిస్తున్నాం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు

జిల్లా కేంద్రంలో రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దహనం

జగిత్యా అగ్రికల్చర్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరువు విలయ తాండవం చేస్తున్న వేళ దేశవ్యతిరేకులతో పెట్టుబడుల ఆర్జనకు భారత్‌ సమ్మిట్‌ పేరుతో కోట్లరూపాయాలు వృథా చేయడం సరికాదని, ఈ సమ్మిట్‌ను బీజేపీ పక్షాన వ్యతిరేకిస్తున్నామని బీజేపీ జిల్లాఅధ్యక్షుడు యాదగిరిబాబు అన్నారు. భారత్‌ సమ్మిట్‌ సమావేశాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని తహశీల్‌ చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యాదగిరిబాబు, పట్టణ అధ్యక్షుడు కాశెట్టి తిరుపతి మాట్లాడుతూ ఈ సమ్మిట్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజాస్వామ్యం, సామాజిక, ఆర్థికన్యాయం, యువత జెన్‌జెడ్‌ సర్‌ ప్రక్రియ లాంటి అంశాలపై చర్చకు పెట్టి దేశంలో జాతీయ సమైక్యతకు భంగం కలిగించే ప్రక్రియకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు. ఏ అధికారిక హోదాతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే సమ్మిట్‌కు వస్తున్నారో తెలపాలని వారు డిమాండ్‌ చేశారు. పెట్టుబడిదారుల సమక్షంలో రాహుల్‌గాంధీని దేశానికి కాబోయే నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నంను భారతీయ జనతాపార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు సిద్ధమైందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధంలేని రాహుల్‌గాంధీని సమ్మిట్‌కు ముఖ్యఅతిథిగా పిలిచిన సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీనాయకత్వానికి భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి పిల్లి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు మ్యాదరి అశోక్‌, దొనికెల నవీన్‌, సదాశివ్‌, ఆముదరాజు, నారపాక అశోక్‌, రమేష్‌, విజయ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌లు వేముల శ్రీనివాస్‌, సిరిపురం శ్రీనివాస్‌, వివిధ మోర్చాల బాధ్యులు, పదాధికారులు, మండల, పట్టణ బాధ్యులు తదితరులున్నారు.

Updated Date - Nov 15 , 2026 | 12:21 AM