Jagtial: పంట మార్పిడిని యుద్ధ ప్రాతిపాదికన అమలు చేయాలి
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:33 AM
జగిత్యాల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): వర్షా భావ పరిస్థతులతో పంటమార్పిడిని యుద్ధ ప్రాతిపాదికన అమలుచేయాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): వర్షా భావ పరిస్థతులతో పంటమార్పిడిని యుద్ధ ప్రాతిపాదికన అమలుచేయాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధితఅధికారులతో సమీక్షస మావేశం నిర్వహించారు. ప్రత్యామ్నయ పంట లసాగుకు రైతులను విస్తృతంగా చైతన్య పరచా లన్నారు. సరుగుడు, ఆయిల్‌పామ్, కూరగాయ లు, మినుము, పెసర, అనుము లాంటి పంటల సాగుకు కార్యాచరణ సిద్ధంచేయాలని సూచిం చారు. సూపర్‌ఎల్‌నినో ప్రభావంతో, వర్షాభావం, సాగునీటి కొరత పరిస్థితుల నేపథ్యంలో రైతు లను చైతన్య పరచాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో జిల్లాస్థానికసంస్థల అదనపు కలె క్టర్ రాజాగౌడ్, డీఆర్‌డీవో రఘువరన్, రైతు విజ్ఞానకేంద్రం కోఆర్డినేటర్ రఘువరన్, జిల్లావ్య వసాయ అధికారి భాస్కర్, జిల్లా హార్టికల్చర్ అధికారిణి లత, డీపీవో మదన్‌మోహన్, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.
పంటమార్పిడి తప్పనిసరి..
మేడిపల్లి : సూపర్ ఎల్నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న వర్షభావం సాగునీటికొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి(క్రాప్‌డైవర్సిఫికేషన్) చేపట్టాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. మేడిపల్లిమండలంలోని పోరుమల్ల గ్రామం లో పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అభిప్రయాలను తెలుసుకున్నారు. వర్షాలులేక ఎస్సారెస్పీలో 15టిఎంసీల మాత్ర మే నీటినిల్వలు ఉన్నందున కెనాల్ ద్వారా సాగునీరందించే పరిస్థితి లేదన్నారు. రైతులు అధికనీటి అవసరం ఉండే వరిసాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటవైపు మళ్లాలని సూచించారు. పోరుమల్ల గ్రామంలో ప్రతియేటా 1200ఎకరాల్లో వరిసాగుజరుగుతుందని వర్షా భావ పరిస్థితుల దృష్ట్యా ఈయెడాది 200ఎకరాల్లో సరుగుడు తదితర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.కలెక్టర్‌వెంట జిల్లావ్యవసాయ అధికారి భాస్కర్, కోరుట్ల ఆర్డీవో జీవాకర్‌రెడ్డి, డిప్యూటీకలెక్టర్ హరిణీ, తహసీల్దారు మునిందర్, మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ షాహీద్ అలీ, సర్పంచ్ అంజయ్య, రైతులు పాల్గొన్నారు.