Jagtial: ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:51 PM
జగిత్యాల రూరల్/అర్బన్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశమున్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలసాగువైపు మొగ్గు చూపేలా అధికారులు అవగాహన కల్పించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ సూచన
జగిత్యాల రూరల్/అర్బన్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశమున్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలసాగువైపు మొగ్గు చూపేలా అధికారులు అవగాహన కల్పించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు. జగిత్యాల అర్బన్, రూరల్ మండలపరిషత్ కార్యాలయాల్లో శుక్రవారం నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పంట పొలాలకు సాగునీరు అందించే పరిస్థితి లేదని, తాగునీటి అవసరాలకు మాత్రమే నీరు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. సెర్ప్ విషయంలో జగిత్యాల మండలానికి జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మహిళ లకు న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. జగిత్యాల మండల మహిళ సంఘ భవనానికి జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వీబీజీ రాంజీ పథకంలో రైతులకు పొలాలకు నీరు అందించే కాలువల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యే కాధికారి షాబొద్దీన్, ప్యాక్స్‌చైర్మన్‌లు కొలుగూరి దామోదర్‌రావు, సందీప్‌రావు, తహసీల్దార్ హకీమ్, రూరల్ ఎంపీడీవో రమాదేవి, ఇన్‌ఛార్జి ఎంపీడీవో వాసవి, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, రూరల్‌మండల ప్రత్యేకాధికారి భాస్కర్, సర్పంచులు, ఎంపీటీసీలు, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.
సొంతింటి కల సాకారం..
రాయికల్ : ఇందిరమ్మ ఇళ్లతో పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మండలంలోని ఇటిక్యాల, కుమ్మరిపల్లి గ్రామాల్లో పలువు రికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తవగా గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరై నూతనగృహాలను ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ రవీందర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్‌లు ఏనుగు మల్లారెడ్డి, మర్రిపెల్లి శ్రీనివాస్ గౌడ్, శేఖర్‌రెడ్డి, సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగిరెడ్డి సాయిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ గన్నె రాజరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సురేందర్ నాయక్, మాజీ సర్పంచ్ సామల్ల వేణు తదితరులు పాల్గొన్నారు.