Share News

Jagtial: కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్‌..

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:55 AM

సారంగాపూర్‌, సెప్టెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి కౌంట్‌ డౌన్‌ మొదలైందని బీఆర్‌ఎస్‌పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు.

Jagtial:   కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్‌..

సారంగాపూర్‌, సెప్టెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి కౌంట్‌ డౌన్‌ మొదలైందని బీఆర్‌ఎస్‌పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420హామీల్లో అనేకం అమలు చేయడం లేదని నిరసిస్తూ శుక్రవారం మండలంలోని పెంబట్ల దుబ్బరాజన్న ఆల యం ఎదుట నిరసనచేపట్టారు. ఈసందర్భంగా మండలం నలుమూలల నుంచి బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను ఖతం చేసేందుకే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరా డని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్‌ అని.. రేవంత్‌రెడ్డిని సాగనంపే రోజులు దగ్గరపడ్డాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనలో ఆరుగ్యారెంటీలు, 420హామీలకే పరిమితం అయిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన బాకీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజు, కొల్ముల రమణ, సాగిసత్యంరావు, మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌ ఆకుల రమేష్‌, జితేందర్‌ యాద వ్‌, ఆకుల రాజిరెడ్డి, ముక్కర శంకర్‌, బైరి మల్లేశం, సుభాష్‌, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

ఇది వెయ్యి అబద్దాల రేవంత్‌ సర్కార్‌..

ఇబ్రహీంపట్నం : తెలంగాణలో నుడుస్తున్నది వెయ్యి అబద్దాల రేవంత్‌ ప్రభుత్వం అని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్య క్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు విమర్శించారు. మండల కేంద్రంలోని ఇందిరాచౌక్‌ వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటావార్పు, ధర్నాకార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చకపోగా కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, తదితర పథకాలను తుంగలో తొక్కారని విమర్శించారు. కాంగ్రెస్‌పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజ య్‌ అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మూసి సుందరీ కరణకు, అందాల పోటీలకు పైసలు ఉంటాయి కానీ ప్రజా పథకాలను అమలు చేయడానికి మాత్రం డబ్బులు లేవా అంటూ విమర్శించారు. విద్యార్థినులకు స్కూటీలు, మహిళ లకు రూ.4వేలపెన్షన్‌ హామీలను నెరవేర్చకుండా కాలయా పన చేస్తున్నారన్నారు. అనంతరం రోడ్డుపైనే మహిళలు, కార్యకర్తలతో కలిసి వారు భోజనం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు లోకబాపురెడ్డి, దారిశెట్టి రాజేష్‌, ఎలాల దశరథ్‌రెడ్డి, నోముల లక్ష్మారెడ్డి, బద్దంగోపి, నేమురి సత్యనారా యణ, చిన్నారెడ్డి, లక్పతిరెడ్డి, ఆంజనేయులుగౌడ్‌, పార్టీనాయ కులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:55 AM