Share News

Jagtial:ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:07 AM

కోరుట్ల, అక్టోబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించిందని వెలమ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌, కాంగ్రెస్‌ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు.

Jagtial:ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి

- వెలమ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ నర్సింగరావు

కోరుట్ల, అక్టోబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించిందని వెలమ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌, కాంగ్రెస్‌ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. శనివారం పట్టణంలోని శ్రీవేంకటేశ్వర దేవాలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో జువ్వాడి నర్సింగరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేవాలయ శాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్‌ రాజమాళి దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎతిరాం నర్సయ్య డైరెక్టర్ల్‌ నేతి శ్రీనివాస్‌, కటుకం దివాకర్‌, కోట గంగాధర్‌, గోడికే రాములు, చిలువేరి విజయ్‌ చిట్యాల పద్మలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో దేవాలయ ఈవో విక్రం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిరుమల వసంత గంగాధర్‌, కాంగ్రెస్‌పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 12:07 AM