Share News

Jagtial: కేంద్ర నిధులను గ్రామాల అభివృద్ధికి కేటాయించాలి

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:39 AM

జగిత్యాల అగ్రికల్చర్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వ నిధులు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చొరవచూపాలని

Jagtial: కేంద్ర నిధులను గ్రామాల అభివృద్ధికి కేటాయించాలి

బీజేపీ రాష్ట్రనాయకురాలు శ్రావణికి సర్పంచ్‌ల వినతి

జగిత్యాల అగ్రికల్చర్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వ నిధులు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చొరవచూపాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర నాయకురాలు భోగ శ్రావణిని గ్రామాల సర్పంచ్‌లు శనివారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచులు తమ గ్రామాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు కేంద్రప్రభుత్వం ద్వారా విడుదలయ్యే ఉపాధిహామీ నిధులను గ్రామాలవారీగా కేటాయించి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించాలని కోరారు. భోగ శ్రావణి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధుల విడుదల అంశాన్ని ఎంపీ అర్వింద్‌ సహకారంతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రాజేందర్‌, సతీష్‌, గంగన్న, రవి, మహేష్‌, గంగాధర్‌, వంశీ, సంతోష్‌, స్వామిరెడ్డి తదితరులున్నారు.

Updated Date - Aug 09 , 2026 | 12:39 AM