Share News

Jagtial: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కనిపించడం లేదని బీజేపీ నిరసన

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:41 AM

ధర్మపురి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కనబడటం లేదని పోస్టర్లతో ధర్మపురి పట్టణంలో శనివారం

Jagtial: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కనిపించడం లేదని బీజేపీ నిరసన

ధర్మపురి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కనబడటం లేదని పోస్టర్లతో ధర్మపురి పట్టణంలో శనివారం బీజేపీ అధ్యక్షుడు గాజు భాస్కర్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాజు భాస్కర్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల తరువాత నుంచి ఇప్పటివరకు ఎంపీ వంశీకృష్ణ ఇక్కడ సమస్యలు పట్టించుకోలేదని అన్నారు. కేంద్ర నిధులతో ఎలాంటి అభివృద్ది చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంతో జ్ఞానోదయం తెచ్చుకుని పట్టణ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లాకార్యదర్శి బెజ్జారపు లవణ్‌, ప్రధానకార్యదర్శి తిరుమన్‌దాసు సత్యనారాయణ, పల్లెర్ల సురేందర్‌, ఎండోమెంట్‌ కన్వీనర్‌ కలకోట రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 12:41 AM