Jagtial: భూముల హక్కుల శాశ్వత భద్రత కోసం భూ భారతి
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:13 AM
కోరుట్ల రూరల్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేడుతున్న భూ భారతి రీసర్వేలో భూముల హక్కులకు శాశ్వత భద్రత లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.
- జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
కోరుట్ల రూరల్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేడుతున్న భూ భారతి రీసర్వేలో భూముల హక్కులకు శాశ్వత భద్రత లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం మండలంలోని సంగెం గ్రామంలో సంగమేశ్వర ఫంక్షన్‌హల్‌లో నిర్వహించిన భూ భారతి రీసర్వే అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. భూ సర్వేలో రైతులు చురుకుగా పాల్గొన్ని సర్వేబృందానికి సహకారం అందించాలని సూచించారు. ప్రతి రైతుకు భూ భారతి చట్టం ప్రకారం9(1) నోటీసులు జారీ చేసి ముందస్తు సమాచారం అందజేస్తారని తెలిపారు. నోటీసులో పేర్కొన్న తేదీ, సమయానికి రైతులు తప్పనిసరిగా తమ భూమి వద్ద ఉండాలని సూచించారు. అనంతరం సంగమేశ్వర దేవాలయ సమీపంలో మొక్కలు నాటి వాటి పరిరక్షణకై టీగార్డులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అదికారి జీవకర్ రెడ్డి, తహసిల్దార్ కృష్ణ చైతన్య, ఆర్‌ఐ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ చీటి స్వరూప వెంకటరావులతో పాటు గ్రామస్థులు, రెవ్యేనూ సిబ్బంది పాల్గొన్నారు.