Share News

Jagtial: ఆడబిడ్డల ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:25 AM

జగిత్యాల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆడబిడ్డల ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు.

 Jagtial:   ఆడబిడ్డల ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

- కలెక్టర్‌ సత్య ప్రసాద్‌

జగిత్యాల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆడబిడ్డల ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌ పాల్గొన్నారు. మహిళలు సమష్టిగా బతుకమ్మ ఆడటం వల్ల సాంఘిక ఐక్యత బలపడుతుందని తెలిపారు. రంగురంగుల పూలతో బతుకమ్మను అలంక రించి మహిళలు ఆట, పాటలతో పండుగ చేసుకోవడం నిజంగా కన్నులపండుగలా ఉందన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం అనందంగా ఉందన్నారు. మహిళా అధికారులు, సిబ్బంది ఉత్సాహకంగా బతుకమ్మ పాటలు పడుతూ బతుకమ్మ ఆడారు. మహిళలు బతుకమ్మ నిమజ్జనం సమయంలో చెరువులు, కుంటలు, వాగుల వద్ద జాగ్రత్త వహించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ నిమజ్జనం ఏర్పాట్లు చేసినట్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌(రెవెన్యూ) ఎన్‌ ప్రసూనాంబ, మహిళాఅధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 12:25 AM