Jagtial: మున్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:08 AM
ధర్మపురి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ధర్మపురిక్షేత్రంలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి, అనుబంధదేవాలయాల్లో దసరా నవరా త్రోత్సవాలు ఏడవరోజు శనివారం ఘనం గా నిర్వహించారు.
ధర్మపురి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ధర్మపురిక్షేత్రంలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి, అనుబంధదేవాలయాల్లో దసరా నవరా త్రోత్సవాలు ఏడవరోజు శనివారం ఘనం గా నిర్వహించారు. అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. సాయంత్రం శ్రీయోగ, ఉగ్రనరసింహ స్వామి వారలకు హనుమత్ వాహనంపై పురవీధులగుండా ఊరేగించారు.
బీర్పూర్: మండలంలోని బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పల్లకిసేవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈవోకిరణ్, చైర్మన్ శ్రీని వాస్ భక్తులు పాల్గొన్నారు.
మల్లాపూర్: మండలంలోని మొగిలిపే టలో వెంటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిపల్లకిసేవ నిర్వహిం చారు.
ధర్మపురి: పట్టణవీధుల్లో, గోదావరినది వద్ద మహిళలు, యువతులు, చిన్నపిల్లలు గౌరీదేవిపాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. గోదావరి నదిలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
మెట్‌పల్లిటౌన్: పట్టణంలో మున్నూరు కాపుసంఘం, యూత్‌ఫోర్స్ ఆధ్వర్యంలో మహిళలు బోనాలతో పెద్దఎత్తున తరలి వెళ్లి అమ్మవారికి మొక్కులు సమర్పిం చుకున్నారు. బోనాలజాతర, అన్నదాన కార్యక్రమంలో నాయ కులు పాల్గొన్నారు.
రాయికల్/కొడిమ్యాల: పట్టణంలో, గ్రామాల్లో అమ్మవారు శ్రీమహాలక్ష్మి, సరస్వతీ దేవిఅవతారంలో భక్తు లకు దర్శనమిచ్చారు. భూపతిపూర్‌లో ప్రతిష్ఠిం చిన అమ్మవారిని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. చింతలూరులో చిన్నారులకు జీవన్‌రెడ్డి అక్షరాభ్యాసం చేయించారు.
కోరుట్ల : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించంగా వెలమ సంక్షే మసంఘ రాష్ట్రచైర్మెన్ జువ్వాడి నర్సింగ రావు ప్రారంభించారు. పట్టణంలోని వేంక టేశ్వరస్వామి దేవాలయంలో స్వామి వారు పొన్న చెట్టు వాహనంపై దర్శనం ఇచ్చాడు.
పెగడపల్లి: మండలంలోని రాజా రాంపల్లి, కీచులాటపల్లి రెండు పక్కపక్క గ్రామాలు. ఈ రెండు గ్రామాల కూడలిలో ఆ రెండుగ్రామాల ప్రజలు 13సంవ త్సరాలుగా దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ కలసికట్టుగా పూజలు నిర్వహి స్తున్నారు. మండపం వద్ద అన్నదాన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఐక్యత చాటుతున్నారు.
మెట్పల్లి రూరల్ : మండలంలోని వెల్లుల్లలోని దుర్గాదేవికి శనివారం కుంకుమపూజలను భక్తులు ఘనంగా నిర్వహించారు.
రాయికల్ : రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం రాత్రి మున్సిపల్ పాలకవర్గసభ్యులు, మహిళలు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు బట్టలను పంపిణీ చేశారు.