Jagtial: స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:18 AM
జగిత్యాల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కలెక్టరేట్‌లో, పోలీసు ప్రధాన కార్యాలయ మైదానంలో ఈనెల15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు
జగిత్యాల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కలెక్టరేట్‌లో, పోలీసు ప్రధాన కార్యాలయ మైదానంలో ఈనెల15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. దరూర్ క్యాంపులో గల పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అజారోద్దిన్ చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ జరుపనున్నారు. సాయంత్రం వివిధ కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను ఇటీవల కలెక్టర్ సత్యప్రసాద్, కలెక్టర్ అశోక్‌కుమార్ తదితరులు పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యప్రసాద్ జాతీయ పతాకావిష్కరణ జరపడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.