Share News

Jagtial: పట్టణంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:51 AM

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 4 (ఆంధ్ర జ్యోతి): జగిత్యాల పట్టణంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొ న్నారు.

Jagtial:  పట్టణంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 4 (ఆంధ్ర జ్యోతి): జగిత్యాల పట్టణంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొ న్నారు. పట్టణంలోనిఉప్పరిపేట్‌లో వెలమ సంక్షేమసంఘంలో రూ.3లక్షలతో చేపట్టిన అభివృద్ధిపనులను ప్రారంభించారు. అనం తరం హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి శ్రీని వాస్‌, కౌన్సిలర్లు అల్లాల సరిత రమేష్‌ రావు, దుమాల రాజ్‌కుమార్‌, గిరిధర్‌, మాజీఎఎంసీ చైర్మన్‌ దామెదర్‌రావు, సం ఘం అధ్యక్షుడు భగవంతరావు, నాయ కులు దామోదర్‌రావు, బాలే శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఫ ఉపాధ్యాయుల సమస్యలను

సీఎం దృష్టికి తీసుకువెళ్తా

జగిత్యాల : ఉపాధ్యాయుల సమస్య లను సీఎందృష్టికి తీసుకవెళ్లి పరిష్కరింప జేయడానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే సంజ య్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గురువందన్‌ కార్యక్రమం నిర్వహించారు. విద్యావ్యవ స్థకు విశిష్ట సేవలందించిన 85మంది ఉపాధ్యాయులను సన్మానించారు. పెండిం గ్‌లో ఉన్న పీఆర్‌సీ, డీఏ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం జరిగే ప్రయ త్నం చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో రాము, తెలంగాణ సామాజిక సమరసతా వేదిక కన్వీనర్‌ అప్పాల ప్రసా ద్‌, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒడ్నాల రాజశేఖర్‌, జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి ప్రసాద రావు, ప్రధాన కార్యదర్శి కొక్కులరాజేష్‌, వీరమల్ల వెంకట రమణారావు, భువనగిరి దేవ య్య, అందె శివ ప్రసాద్‌, చెరుకు మహేశ్వర్‌శర్మ, ఎలిగేటి రాజేంద్ర ప్రసాద్‌, వివిధ మండలాల అధ్య క్ష, ప్రధానకార్య దర్శులు తపస్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఫ నేరాల నియంత్రణకు

సీసీ కెమెరాలు చాలా అవసరం

బీర్‌పూర్‌ : నేరాలను నియంత్రించ డంలో సీసీకెమెరాలు ఎంతగానో ఉపయో గపడుతాయని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో గ్రామపంచాయతీ నిధులతోఏర్పాటు చేసినసీసీకెమెరాలు, గ్రామంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన మైకులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎలమట్ల హరీష్‌, ఉపసర్పంచ్‌ జితేంధర్‌, కెడీసీసీజిల్లామెంబర్‌ ముప్పాల రాంచంధర్‌రావ్‌, ఆలయ చైర్మన్‌ శ్రీనివాస్‌, నాయకులు మహిపాల్‌ రెడ్డి, నారపాక రమేష్‌, గంగాధర్‌, సర్పంచ్‌లు మారుతి, లక్ష్మన్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ఫ ఇందిరమ్మ ఇళ్లలో

దళితులకే అధిక ప్రాధాన్యత

సారంగాపూర్‌ : ఇందిరమ్మ ఇళ్లలో దళితులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. నియోజకవర్గంలో దిళితులకు 909ఇంది రమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. మండలంలో 483ఇళ్లు మంజూరు కాగా 120 దళితులకు మంజూరు చేశామని తెలిపారు. అనంతరం రూ.56లక్షలతో రంగపేట, ఆలూరు వయా బతుకమ్మ కుంట ఫార్మేషన్‌ రోడ్డును ప్రారంభిం చారు. కోనాపూర్‌, రంగపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌, ఏదుల శేఖర్‌, ఎంపీడీవో నీరజ, సర్పంచ్‌ లు, సొల్లు సురేందర్‌, అరుణశేఖర్‌, రాధ రాజు, జ్యోతి శ్రీనివాస్‌, మాధవి బాపి రాజు, మ్యాకల శేఖర్‌, రుషేంద్ర శంకర్‌ రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, గుర్నా థం మల్లారెడ్డి, కోల శ్రీనివాస్‌ శేఖర్‌గౌడ్‌, రాజిరెడ్డి, డీఈమిలింద్‌, ఏఈలు విశ్వేం దర్‌, తిరుమల, గ్రామస్థులు పాల్గొన్నారు.

రాయికల్‌: మండలంలోనిచింత లూరు గ్రామానికిచెందిన ముంజం భాగ్య లక్ష్మి-వెంకటరెడ్డికి మంజూరైన ఇంది రమ్మఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ హాజర య్యారు. చీరను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రమేష్‌ నాయక్‌, ఆత్మచైర్మన్‌ గంగారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మల్లారెడ్డి, మండల పార్టీ అధ్య క్షుడు రవీందర్‌రావు, కోలశ్రీనివాస్‌, శేఖర్‌ రెడ్డి, మహేందర్‌గౌడ్‌,మాజీసర్పంచ్‌ అను పురం శ్రీనివాస్‌, మోహన్‌రావు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:51 AM