Share News

Jagtial: సోషల్‌ వెల్ఫేర్‌ వసతిగృహాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్‌

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:11 AM

మెట్‌పల్లి టౌన్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆరపేట తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలికలపాఠశాల, జూనియర్‌ కళాశాల

Jagtial: సోషల్‌ వెల్ఫేర్‌ వసతిగృహాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్‌

మెట్‌పల్లి టౌన్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆరపేట తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలికలపాఠశాల, జూనియర్‌ కళాశాల హాస్టల్‌ను అదనపుకలెక్టర్‌ రాజుగౌడ్‌, మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌ మైలారపు లింబాద్రి, కౌన్సిలర్లతో కలిసి తనిఖీచేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి, నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినుల హాస్టల్‌లో వసతులు, విద్యాబోధన, అందుతున్న సౌకర్యాలపై ముచ్చటించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఓంకారి నవీన్‌, కౌన్సిలర్లు నూనుగొండ నరేష్‌, గుడికందుల అజయ్‌, అజీమ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు గజం రవి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మిషన్‌ భగీరథ వాటర్‌ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ రాజా(01.......ఐబీఎంపీ24)

మిషన్‌ భగీరథ ప్లాంట్‌ను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

ఇబ్రహీంపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని డబ్బా గ్రామంలోని మిషన్‌ భగీరథ వాటర్‌ ప్లాంట్‌ని అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ శుక్రవారం సందర్శించారు. మండల పర్యటనలో భాగంగా ఆయన వాటర్‌ ప్లాంట్‌ని సందర్శించి, నీటిసరఫరా విధానాన్ని, నీటినాణ్యత పరిమాణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట జిల్లా మిషన్‌భగీరథ గ్రిడ్‌ ఈఈ జానకి, ఎంపీడీవో గణేష్‌, తహసీల్దార్‌ వరప్రసాద్‌, ఎంపీవో రామకృష్ణ రాజు, మిషన్‌ భగీరథ డీఈఈ మల్లేష్‌, ఏఈఈలు వింధ్యారాణి, జ్ఞానేశ్వర్‌, లత, మేనేజర్‌ నాగరాజు, సర్పంచ్‌ పుప్పాల లక్ష్మి, ఉపసర్పంచ్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 12:11 AM