Jagtial: విద్యుత్ సమస్యలు తెలుసుకోవడానికే పరిష్కార వేదిక
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:10 AM
మెట్‌పల్లి రూరల్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకోవడానికి పరిష్కార వేదికను నిర్వహిస్తున్నామని
మెట్‌పల్లి రూరల్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకోవడానికి పరిష్కార వేదికను నిర్వహిస్తున్నామని వేదిక(సీజీఆర్‌ఎఫ్) చైర్మన్ చవాన్ జైవంత్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని మేడిపల్లి గ్రామంలోని 33/11కేవీ ఎస్‌ఎస్ ఆవరణలో నిర్వహించిన విద్యుత్‌సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వినతలు స్వీకరించారు. అనంతరం అధికారులతో కలిసి మొబైల్ విద్యుత్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ జైవంత్‌రావు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, కొత్త విద్యుత్‌కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ లోపాలు, స్తంభాలు, తీగల సమస్యలు వంటి అంశాలను వేదికలో సీకరించామని, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మెంబర్ ఫైనాన్స్ జిల్లాఅధికారి శ్రీనివాస్, ఎస్‌ఈ సుదర్శనం, టెక్నికల్ డీఈ గంగారాం, డీఈ మధుసూదన్, ఏఈలు, సిబ్బంది, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.