Share News

Jagtial: ఏడాదికి రెండు వేల ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:53 PM

జగిత్యాల టౌన్‌/ జగిత్యాల రూరల్‌/ సారంగాపూర్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ప్రతిఏడాది 2వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లుమంజూరు చేస్తామని ఎమ్మెల్యే డాక్ట ర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Jagtial:  ఏడాదికి రెండు వేల ఇందిరమ్మ ఇళ్లు

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌/ జగిత్యాల రూరల్‌/ సారంగాపూర్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ప్రతిఏడాది 2వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లుమంజూరు చేస్తామని ఎమ్మెల్యే డాక్ట ర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. పట్టణంలోని 1, 18, 19, 34 వార్డులలో, జగిత్యాలరూరల్‌ మండలం ధర్మారం గ్రామసర్పంచ్‌ పరుమాల సుమలత, సారంగాపూర్‌ మండలంలోని పోతారం, సారంగాపూర్‌, రంగపేట, లచ్చక్కపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు. అనంతరం చీర కానుకగా ఇచ్చి శుభకాం క్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక ఇందిరమ్మ ఇళ్లు జగిత్యాలకు మంజూరు అయ్యాయని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తా మని తెలిపారు. రాష్ట్ర క్యాబినేట్‌లో జగిత్యాల కేంద్రీయ విద్యాల యానికి 5ఎకరాల స్థలం కేటాయించారని తెలిపారు. కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఎంపీవో రవిబాబు, సర్పంచ్‌ శంకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణిశ్రీనివాస్‌, ఏయంసి చైర్మన్‌ గడ్డం నారాయణ రెడ్డి, కౌన్సిలర్లు చెట్టె గంగాధర్‌, కూతురు శేఖ ర్‌, ఏనుగుల లావణ్య రాజు, అయూబ్‌ ఖాన్‌, దూమాల రాజ్‌కుమార్‌, కూతురు రాజేష్‌, దయాల శంకర్‌, ఖయ్యూం, గిరిధర్‌, గంగాధర్‌, సారంగాపూర్‌లో తహశీల్దార్‌ ఎండీ వహిదోద్దిన్‌, ఎంపీవో సలీం, సర్పంచ్‌లు అరుణశేఖర్‌, జ్యోతి శ్రీనివాస్‌, రాధ రాజు, రమ భాస్కర్‌, మాదవి బాపిరాజు, రేషేంద్ర శంకర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రామరావు,సుధాకర్‌, నారా యణరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:53 PM