Share News

Jagtial: కేంద్రీయ విద్యాలయానికి తక్షణమే 10ఎకరాలు కేటాయించాలి

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:49 PM

జగిత్యాల అగ్రికల్చర్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జగిత్యాలరూరల్‌ మండలం చల్‌గల్‌ గ్రామంలో ఏర్పా టు చేయనున్న కేంద్రీయ విద్యాలయానికి తక్షణమే 10ఎకరాల స్థలం కేటాయించాలని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు.

Jagtial:  కేంద్రీయ విద్యాలయానికి తక్షణమే 10ఎకరాలు కేటాయించాలి

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌

జగిత్యాల అగ్రికల్చర్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జగిత్యాలరూరల్‌ మండలం చల్‌గల్‌ గ్రామంలో ఏర్పా టు చేయనున్న కేంద్రీయ విద్యాలయానికి తక్షణమే 10ఎకరాల స్థలం కేటాయించాలని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానికవీకేబీ ఫంక్షన్‌హాల్‌లో బీజేపీ నాయ కులు, వివిధ హోదాల ప్రతినిధులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో చదువురాని విద్యాశాఖమంత్రి, సీఎం ఉండడం విచారకరం అన్నారు. జగిత్యాల భూములన్నీ జగిత్యాల ఎమ్మెల్యేకు గుత్తకు రాసిండ్రా అని ప్రశ్నించారు. కాస్ట్లీ ల్యాండ్స్‌ అయితే కబ్జా చేస్తా వా, లేకపోతే ప్లాట్లుపెట్టి అమ్ముతావా అని నిలదీశారు. ప్రతిజిల్లాలో పదెకరాల స్థలం కేటాయిస్తుందని, జగి త్యాలకు వచ్చిన కేంద్రీయ విద్యాలయానికి మాత్రం ఐదెకరాలు కేటాయిస్తామని పేర్కొనడం సరికాదన్నారు. నవోదయ, కేంద్రీయవిద్యాలయాల విలువ తెలియక పోవడం విచారకరం అన్నారు. చిల్లర రాజకీయాలు పక్కనపెట్టి అన్నిజిల్లాల మాదిరిగానే 10ఎకరాల స్థలం కేటాయించాలన్నారు. దిశమీటింగ్‌లో చెప్పిన సమస్య లన్నీ పరిష్కరించినందున కలెక్టర్‌ను ప్రశంసిస్తున్నా మన్నారు. అనంతరం ఇటీవల నియమితులైన కమి టీల బాధ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలి పారు. సమావేశంలో పార్టీ జిల్లాఅధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర నాయకురాలు భోగశ్రావణి, కొక్కు గంగా ధర్‌, దశరథరెడ్డి, పాత రమేష్‌, నారపాక అశోక్‌, ఓరు గంటి చంద్రశేఖర్‌, జుంబర్తి దివాకర్‌, మమత, మానస, దొనికెల నవీన్‌, శ్రీనివాస్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలున్నారు.

రాష్ట్రపథకాలను

సీఎస్‌సీలోకి తీసుకురావాలి..

రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమపథకాలు, ప్రజాసేవల ను కామన్‌ సర్వీస్‌సెంటర్‌ (సీఎ స్‌సీ)ల ద్వారా డిజిటలైజేషన్‌ చేసి గ్రామీణప్రజలకు చేరువచేయాలని తెలంగాణ సీఎస్‌సీ వీఎల్‌ఈ డిజి టల్‌ సేవాసొసైటీ ప్రతినిధులు శుక్రవారం జగిత్యాల పర్యటనకు వచ్చిన ఎంపీ అర్వింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ సంక్షేమపథకాల దరఖా స్తు ప్రక్రియనుకూడా సీఎస్‌సీ వ్యవస్థకు అనుసంధా నం చేస్తే, గ్రామీణప్రాంత ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు. కార్యక్రమంలో సీఎస్‌సీ వీఎల్‌ఏనిర్వాహకులు గణేష్‌, రఘుపతిరెడ్డి, మనోహర్‌, సురేష్‌, స్వామి, మల్లేష్‌, వేణు తదితరులున్నారు.

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

జగిత్యాల : ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కల్పించేలా కృషిచేయాలని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు తెలంగాణ ప్రాంతఉపాధ్యాయ సంఘం(తపస్‌) జిల్లాశాఖ నేతలు వినతిపత్రం అందించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎంపీ అరవింద్‌ను కలిసి సమస్యను విన్నవించారు. 2010 ఏప్రిల్‌ 1వ తే కంటే ముందు న్యాయబద్దంగా నోటిఫికేషన్‌ వచ్చి నియామకం అయిన ఉపాధ్యా యులకు అప్పటి సమయంలో టెట్‌ అవసరం లేదని స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు. తర్వాత డీఎస్‌సీ నోటిఫికేషన్‌లో టెట్‌అర్హత ఆధారంగానే నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో తపస్‌ జిల్లా అధ్యక్షుడు బోయినపల్లిప్రసాద్‌రావు, ప్రధానకార్య దర్శి కొక్కుల రాజేశ్‌, రాష్ట్రబాధ్యులు బోనగిరి దేవయ్య, ఎలిగేటి రాజేంద్ర ప్రసాద్‌, సందేల్లి మలహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీని కలిసిన మెట్‌పల్లి

బీజేపీ పట్టణ కార్యవర్గం

మెట్‌పల్లి టౌన్‌: బీజేపీ పట్టణ నూతన కార్యవర్గం నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసింది. ఈమేరకు పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్‌ నూతనకార్యవర్గాన్ని శుక్ర వారం జగిత్యాలలో ఎంపీకి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్‌ నూతన కార్యవర్గాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jul 03 , 2026 | 11:49 PM